Warangal New Bus Station : రూ.75 కోట్లతో 2.32 ఎకరాల్లో వరంగల్‌ అత్యాధునిక బస్‌ స్టేషన్‌-new bus station to come up in warangal with 75 crore ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  New Bus Station To Come Up In Warangal With 75 Crore

Warangal New Bus Station : రూ.75 కోట్లతో 2.32 ఎకరాల్లో వరంగల్‌ అత్యాధునిక బస్‌ స్టేషన్‌

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 04:03 PM IST

Warangal Bus Station : వరంగల్‌లో పాత బస్‌ స్టేషన్‌ స్థానంలో అత్యాధునిక బస్‌ స్టేషన్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులపై అధికారులు దృష్టి పెట్టారు.

వరంగల్ కొత్త బస్ స్టేషన్
వరంగల్ కొత్త బస్ స్టేషన్

వరంగల్‌లో పాత బస్‌ స్టేషన్‌ స్థానంలో కొత్త బస్‌ స్టేషన్‌ రానుంది. కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (KUDA) పనులను ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలనుకుంటోంది. 2.32 ఎకరాల్లో రూ.75 కోట్ల అంచనా వ్యయంతో 32 ప్లాట్‌ఫారమ్‌లతో ఐదు అంతస్తుల భవనం రానుంది.

ట్రెండింగ్ వార్తలు

రెండ్రోజుల క్రితం టీఎస్‌ఆర్‌టిసీ(TSRTC), గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) అధికారులతో స్థలాన్ని పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. 2050లో కూడా నగరం రవాణా అవసరాలను తీర్చేందుకుడా DPR సిద్ధం చేశారు. ఐదు అంతస్థుల భవనంలో షాపింగ్ మాల్స్, హోటళ్ళు, ఇతర సౌకర్యాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నాయి.

1.10 ఎకరాల భూమిని జీడబ్ల్యూఎంసీకి అప్పగించాలని నిర్ణయించారు. దశలవారీగా ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. అయితే ద్విచక్ర వాహనాలు(Two Wheelers), కార్ల పార్కింగ్ సెల్లార్ మరియు గ్రౌండ్ ఫ్లోర్ ఒక సంవత్సరం వ్యవధిలో నిర్మిస్తారు. KUDA తన స్వంత డబ్బును ఖర్చు చేసి TSRTC కోసం గ్రౌండ్ ఫ్లోర్‌ను అప్పగిస్తుంది. ఇతర అంతస్తులను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇస్తారు. ఆదాయాన్ని KUDA , TSRTC పంచుకుంటుంది. కొత్త బస్ స్టేషన్ డిజైన్ ఇప్పటికే సిద్ధమైంది. డిజైన్ ప్రకారం కొత్త బస్ స్టేషన్, ప్రతిపాదిత 'నియో' మెట్రో రైల్వే స్టేషన్ మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉంటుంది.

వరంగల్ బస్ స్టేషన్(Warangal Bus Station) ఆవరణ.. దాని చుట్టు పక్కల స్థలాలను కలిపి విశాలంగా కొత్త బస్టాండ్ ఉంటుంది. వరంగల్ బస్ స్టేషన్ పక్క నుంచి కూరగాయల మార్కెట్ మీదుగా కాశీబుగ్గ ప్రధాన రహదారికి కలిపేలా రోడ్డు నిర్మాణంపై చర్చలు నడుస్తున్నాయి. రెండున్నర ఎకరాల్లో కొత్త బస్టాప్ రానుంది. ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తారు. 32 బస్ ప్లాట్ ఫారంలను నిర్మించనున్నారు.

IPL_Entry_Point