Sandhya Theatre Stampede Case : అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు - నాంపల్లి కోర్టు ఉత్తర్వులు
Sandhya theatre stampede case : హీరో అల్లు అర్జున్‌కు ఊరట దక్కింది. సంథ్య థియేటర్ ఘటనలో రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ఈ మేరకు నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రూ.50 వేలు, ఇద్దరి పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది.
సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. ఆయనకు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది. రూ.50 వేలతో పాటు రెండు పూచీకత్తులపై బెయిల్ మంజూరు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
సంథ్య థియేటర్ ఘటనలో కేసు…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన్ను విచారించిన పోలీసులు… అరెస్ట్(డిసెంబరు 13) చేశారు. పోలీసుల కేసుతో పాటు అరెస్ట్ ను సవాల్ చేస్తూ అల్లు అర్జున్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. వాదోపవాదనలు తర్వాత… అదే రోజు అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించటంతో ఆయన్ను జైలుకు తరలించారు. బెయిల్ పేపర్లు ఆలస్యంగా అందటంతో ఆ రోజు రాత్రంతా… అల్లు అర్జున్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. మరునాడు ఉదయం 7 గంటల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.
ఇక హైకోర్టులో మధ్యంతర బెయిల్ పొందిన అల్లు అర్జున్… ఆ తర్వాత రెగ్యూలర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. అల్లు అర్జున తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న నాంపల్లి కోర్టు… తీర్పున రిజర్వ్ చేసి.. జనవరి 3న వెలువరిస్తామని తెలిపింది. ఈ మేరకు ఇవాళ నాంపల్లి కోర్టు… అల్లు అర్జున్ కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ పేర్లు ఉన్నాయి. మధ్యంతర బెయిల్ మంజూరు అయిన తర్వాత… అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు విచారించారు. ఇందుకోసం నోటీసులు జారీ చేయగా.. అల్లు అర్జున్ స్టేషన్ కు వెళ్లారు. సుమారు 3.30 గంటల పాటు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను విచారించారు. తొక్కిసలాట ఘటన వీడియో ఆధారంగా అల్లు అర్జున్ ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఇందులో చెప్పిన వివషయాల ఆధారంగా.. పోలీసులు నాంపల్లి కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేశారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… ఇవాళ అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ కేసులో బన్నీకి బిగ్ రిలీఫ్ దొరికినట్లు అయింది.