Nalgonda Mega Job Mela : నిరుద్యోత యువతకు గుడ్ న్యూస్ చెప్పారు నల్గొండ కలెక్టర్. 100కు పైగా కంపెనీలు 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన నల్గొండలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. జాబ్ మేళా పోస్టర్ ను నల్గొండ కలెక్టర్ హరిచందన ఎక్స్ లో విడుదల చేశారు. ఫిబ్రవరి 26న నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరిచందన ప్రకటించారు. ఈ జాబ్ మేళాలో 100కి పైగా కంపెనీల్లో 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ మేనేజ్‌మెంట్, తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సెల్ సహకారంతో కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు సీవీ, అర్హత సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. గత ప్రభుత్వంలో జారీ అయిన గ్రూప్ -1 నోటిఫికేషన్ రద్దు చేసిన కొద్ది సమయంలోనే… కొత్త నోటిఫికేషన్ ను జారీ చేసింది. మొత్తం 563 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. మార్చి 14వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచారు.
సంబంధిత కథనం