BRS: ఆ ఇద్దరే కాదు.. సీన్ లోకి మరో కీలక నేత! మారుతున్న 'మెదక్' రాజకీయం-mynampally hanumanth rao taking steps to make his son contest from medak assembly seat ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Mynampally Hanumanth Rao Taking Steps To Make His Son Contest From Medak Assembly Seat

BRS: ఆ ఇద్దరే కాదు.. సీన్ లోకి మరో కీలక నేత! మారుతున్న 'మెదక్' రాజకీయం

Mahendra Maheshwaram HT Telugu
Feb 22, 2023 03:02 PM IST

TS Assembly Elections 2023: ఎన్నికల ఏడాది రావటంతో అధికార బీఆర్ఎస్ లోని నేతలు వేగంగా పావులు కదిపే పనిలో పడ్డారు. కొందరేమో నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తుండగా... మరికొందరూ మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యే సీటు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ లు ఉన్నప్పటికీ... అదే సీటుపై కన్నేస్తూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే మెదక్ జిల్లాలోని ఓ సీటు వ్యవహారం కూడా అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

బీఆఆర్ మెదక్
బీఆఆర్ మెదక్

Medak Assembly Seat: తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. ఎన్నికల ఏడాది కావటంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు, ప్రతివ్యూహాలతో పాటు పక్కా ప్లాన్ తో అడుగులు వేసే పనిలో పడ్డాయి. ఇక అధికార బీఆర్ఎస్ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్... ఓవైపు మౌనంగా ఉంటూనే తెరవెనక భారీ కసరత్తే చేస్తున్నారని టాక్. ఇప్పటికే అభ్యర్థుల జాబితాపై కూడా ఓ అంచనాకు రావటంతో పాటు మార్చే అభ్యర్థుల విషయంలోనూ ఓ క్లారిటీతోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.... అధికార పార్టీలోని కీలక నేతలు అసెంబ్లీ సీట్లపై కన్నేసి రాజకీయ వేడిని పెంచుతున్నారు. ప్రతి జిల్లాలోనూ ఈ పరిస్థితులు ఉండగా... మెదక్ జిల్లాలోని ఓ సీటు వ్యవహారం మాత్రం పార్టీలో సెగలు పుట్టిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం.... గత ఎన్నికల్లో ఇక్కడ్నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్ రెడ్డి గెలిచారు. 2014లో ఇదే స్థీటు నుంచి గెలిచిన ఆమె... డిప్యూటీ స్పీకర్ గా కూడా పని చేశారు. అయితే గతంలోనే ఈ సీటుపై పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న శేరి సుభాష్ రెడ్డి ఆశలు పెటుకున్నారు. కానీ సీటు దక్కలేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సీట దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీన్ కట్ ప్రస్తుత రాజకీయం మరోలా ఉంది. వీరిద్దరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఓవైపు కొనసాగుతుండగానే... మరో కీలక నేత రంగంలోకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడికి సీటు ఇప్పించి గెలుపించుకోవాలని చూస్తున్నారు. ఫలితంగా మెదక్ రాజకీయం...... ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యేగా మారిపోయింది.

రంగంలోకి మైనంపల్లి...

తాజాగా మెదక్ అసెంబ్లీ సీటుపై ఎమ్మెల్యే మైనంపల్లి కన్నేశారు. తాజాగా ఆయన కుమారుడితో కలిసి నియోజకవర్గ పరిధిలో పర్యటించి హంగామా చేశారు. సేవా ఫౌండేషన్ పేరు జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. అయితే నిజానికి గతంలో ఇదే సీటు నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు మైనంపల్లి హన్మంతరావు. టీడీపీలో ఉండగా జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన మైనంపల్లికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక మెదక్ నియోజకవర్గానికి వస్తే చాలా మంది నేతలు, కార్యకర్తలే కాదు పలు పార్టీల్లోని నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత..... ఆయన మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు. ఇక 2018 ఎన్నికల్లో మల్కాజ్ గిరి అసెంబ్లీ సీటు నుంచి గెలిచి విక్టరీ కొట్టారు. ఇదే సమయంలో ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌ ను రంగంలోకి దింపే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగా ‘మైనంపల్లి సోషల్‌ ఆర్గనైజేషన్‌’ పేరుతో భారీగా సేవలు కార్యక్రమాలు చేస్తున్నారు. వీటన్నింటని కూడా ఆయన కుమారుడే చూస్తున్నారు. అయితే ఈసారి కుమారుడిని అసెంబ్లీకి పంపించి... తాను ఎంపీగా బరిలో(మల్కాజ్ గిరి) ఉండాలని పావులు కదిపారు మైనంపల్లి. ఫలితంగానే మంత్రి మల్లారెడ్డితో విబేధాలు మొదలయ్యాయనే టాక్ కూడా వినిపించింది. ఓ దశలో మంత్రి టార్గెట్ గా మీడియా సమావేశం పెట్టి పలు విమర్శలు చేశారు మైనంపల్లి. ఇందులో పలు అంశాలను ప్రస్తావిస్తూ... మంత్రి తీరును తప్పుబట్టారు. ఇదిలా ఉండగానే తాజాగా మైనంపల్లి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అనూహ్యంగా మళ్లీ మెదక్ పై కన్నేయటంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మెదక్‌ నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌పై రోహిత్‌రావు పోటీ చేస్తారని కొద్ది రోజులుగా నియోజకవర్గంలో కూడా తెగ ప్రచారం జరుగుతున్నది. ఏళ్ల తరబడి ఆగిపోయిన సేవా కార్యక్రమాలను ఇప్పుడు రోహిత్‌ కొనసాగిస్తాడని చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో మెదక్‌ నుంచి తన కొడుకు పోటీలో ఉంటారన్న విషయాన్ని పరోక్షంగా హన్మంతరావు ప్రకటించినట్టయింది.

ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి వర్గాలు మాత్రమే ఉండగా... తాజాగా మైనంపల్లి సీన్ లోకి రావటంతో మెదక్ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ కూడా డైలమాలో పడింది. అయితే మైనంపల్లి తీరుపై స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవందర్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు తెలియకుండా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టడంపై సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మొత్తంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ... మెదక్ పాలిటిక్స్ మాత్రం హీట్ ను పెంచేస్తున్నాయి. అయితే నేతలు మాత్రం టికెట్ కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ... హైకమాండ్ ఆశీస్సులు ఎవరికి దక్కుతాయనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

IPL_Entry_Point