టీచర్ నుంచి లంచం డిమాండ్…! ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ములుగు డీఈవో-mulugu deo gorla panini were caught by the telangana acb ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  టీచర్ నుంచి లంచం డిమాండ్…! ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ములుగు డీఈవో

టీచర్ నుంచి లంచం డిమాండ్…! ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ములుగు డీఈవో

ములుగు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేసింది. ఉపాధ్యాయుని వద్ద నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ డీఈవో పాణిని అడ్డంగా దొరికిపోయాడు. అంతేకాకుండా రూ. 5 వేలు లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ దిలీప్ చిక్కాడు.

ఏసీబీకి చిక్కిన ములుగు డీఈవో

ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పాణిని ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఆయనతో పాటు జూనియర్‌ అసిస్టెంట్‌ దిలీప్‌ కూడా ఏసీబీ అధికారుల వలకు చిక్కాడు.

రూ. 20 వేలు డిమాండ్…

ఏసీబీ విడుదల చేసిన వివరాల ప్రకారం…. జిల్లాకు చెందిన ఓ టీచర్ కొద్దిరోజులుగా లీవ్ లో ఉన్నాడు. సెలవులు పూర్తి కావడంతో తిరిగి విధుల్లో చేరేందుకు ములుగు డీఈవో కార్యాలయంలో రిపోర్టు చేశారు. విధుల్లో చేరేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఇందుకు డీఈవో రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో సదరు టీచర్… ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. డీఈవోను అడ్డంగా పట్టుకున్నారు. డీఈవో పాణినికి రూ.20 వేలు లంచం ఇస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా జూనియర్‌ అసిస్టెంట్‌(ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం) తొట్టె దిలీప్ కుమార్ యాదవ్‌ ను కూడా అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చి..రిమాండ్ కు తరలించారు. జిల్లా డీఈవో.. ఏసీబీ వలకు చిక్కడం సంచలనంగా మారింది.

ఏ ప్రభుత్వ అధికారైనా లంచం అడిగినట్లు అయితే ఏసీబీని సంప్రందించాలని అధికారులు సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని పేర్కొన్నారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యామాలైన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB ) మరియు వెబ్ సైట్ https://acb.telangana.gov.in ద్వారా కూడా తెలంగాణ ఏసీబీని సంప్రదించవచ్చని సూచించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.