Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ముగ్గురు పిల్లలకు విషం కలిపిన ఆహారం తినిపించిన తల్లి.. ఆపై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో కన్నతల్లి కుటుంబ కలహాల కారణంగా పిల్లలకు విషం తినిపించి ప్రాణాలు తీసింది. ఈ ఘటనలో సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ అనే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసే తండ్రి ఇంటికి వచ్చే సరికి భార్య రజిత ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. అప్పటికే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
అపస్మారక స్థితిలో ఉన్న రజితను బీరంగూడ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో విషం ఇచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు రజిత పోలీసులకు వివరించింది. గురువారం రాత్రి అన్నంలో విషం కలిపి తినిపించింది. ఆ సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నాడు. నీళ్ల ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేసే రజిత భర్తకు ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్లినట్టు పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రజిత పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఇంటికి సమీపంలో ఉన్న దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు కలుపుకుని అన్నం తింటుండగా స్పృహ కోల్పోయినట్టు పోలీసులకు తెలిపింది. తర్వాత ఏమి జరిగిందో తెలియదని చెప్పడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రజిత ఆత్మహత్యాయత్నం చేసిందా, ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత కథనం