MMTS Trains Cancelled: పండగపూట షాక్.. ఈ రూట్లలో నడిచే MMTS రైళ్లు రద్దు-mmts trains cancelled on 14th january 2023 check details are ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Mmts Trains Cancelled On 14th January 2023 Check Details Are

MMTS Trains Cancelled: పండగపూట షాక్.. ఈ రూట్లలో నడిచే MMTS రైళ్లు రద్దు

HT Telugu Desk HT Telugu
Jan 14, 2023 07:14 AM IST

Hyderabad MMTS Updates : సంక్రాంతి పండగ వేళ ప్రయాణికులకు షాకిచ్చింది దక్షిణ మధ్య రైల్వే. పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

MMTS Trains Cancelled: సంక్రాంతి పండగ వేళ ప్రయాణికులకు భారీ షాకిచ్చింది దక్షిణ మధ్య రైల్వే. జనవరి 13, 14 తేదీల్లో కలిపి మొత్తం 19 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. పలు పనుల నిర్వహణ కారణాలతో ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

వివరాలివే:

హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో మొత్తం 3 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. ఈ మార్గంలో 47110, 47111, 471119 నంబర్ గల రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఫలక్ నుమా- లింగంపల్లి మార్గంలో 5 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు అయ్యాయి. 47160, 47156, 47158, 47214, 47216 నంబర్ గల రైళ్లు ఈ మార్గంలో రద్దు అయ్యాయి. లింగంపల్లి-ఫలక్ నూమా మార్గంలో మొత్తం ఆరు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు అయ్యాయి. 47181, 47186, 47212, 47183, 47185, 47217 నంబర్ గల రైళ్లను ఈ మార్గంలో రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.

రామచంద్రాపురం-ఫలక్ నూమా మార్గంలో 47177 నంబర్ గల ఎంఎంటీఎస్ సర్వీసును రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఫలక్ నుమా-రామచంద్రాపురం మధ్య 47218, ఫలక్ నూమా-హైదరాబాద్ మధ్య 47201 నంబర్ గల సర్వీసు రద్దు అయ్యాయి.

టైమింగ్స్ ఇవే…

time table of vande bharat express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం ప్రారంభం కానుంది. ప్రారంభం రోజు వందే భారత్‌ రైలు ప్రత్యేక వేళల్లో నడవనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ రైలు ఆగే స్టేషన్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ నెల 15న ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుంది.ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు వందేభారత్ రైలు సేవలందిస్తుంది. విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్‌ రైలు ( ట్రైన్ నెం. 20833) ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.ఇక సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే వందే భారత్ రైలు.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మొత్తం 14 ఏసీ ఛైర్‌ కార్లు సహా రెండు ఎగ్జిక్యూటివ్‌ ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లు ఉంటాయి.

WhatsApp channel