రేపే హైటెక్స్ వేదికగా 'మిస్ వరల్డ్' ఫైనల్స్ – ముఖ్యమైన 7 విషయాలు-miss world final event to be held at hyderabad hitex on may 31 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రేపే హైటెక్స్ వేదికగా 'మిస్ వరల్డ్' ఫైనల్స్ – ముఖ్యమైన 7 విషయాలు

రేపే హైటెక్స్ వేదికగా 'మిస్ వరల్డ్' ఫైనల్స్ – ముఖ్యమైన 7 విషయాలు

72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమంలో హైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. మే 31న సాయంత్రం 6. 30 గంటలకు విజేతను ప్రకటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి సుందరీమణులు తరలివచ్చిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ లో మిస్ వరల్డ్ ఈవెంట్స్ (ఫైల్ ఫొటో)

తెలంగాణలో జరుగుతున్న మిస్ వర్డల్ పోటీలు తుది దశకు చేరాయి. రేపు (మే 31) తుది విజేతను ప్రకటిస్తారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. సాయంత్రం 6. 30 గంటలకు కార్యక్రమం షురూ అవుతుంది.

ప్రపంచ అందాల పోటీల్లో భాగంగా…. సుమారు 20 రోజుల పాటు పలు కార్యక్రమాలు జరిగాయి. సుందరీమణులు పలు కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. అంతేకాకుండా తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

మిస్ వరల్ట్ ఫైనల్ ఈవెంట్ - ముఖ్య వివరాలు:

  1. మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలె, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్ట్ లుగా వ్యవహరిస్తారు.
  2. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఫైనల్స్ లో స్టేజ్ పైన లైవ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
  3. ప్రముఖ మానవతావాది, నటుడు సోనూ సూద్‌కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రధానం చేయనున్నారు. అంతేకాదు ఫైనల్స్ కు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తారు.
  4. ఇతర జ్యూరీలుగా సుధా రెడ్డి, డాక్టర్ కారినా టర్రెల్ (మిస్ ఇంగ్లాండ్ 2014), మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ ఉన్నారు.
  5. మిస్ వరల్డ్ 2017, బాలీవుడ్ నటి మనుషి చిల్లర్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు.
  6. ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం భారతదేశంలో సోనీ లివ్‌లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది, కొన్ని దేశాలలో జాతీయ టెలివిజన్‌లో ప్రసారం అవుతుంది.
  7. ప్రపంచవ్యాప్తంగా www.watchmissworld.com ద్వారా హై డెఫినిషన్‌లో అందుబాటులో ఉంటుంది.

ఎంపిక విధానం ఇలా ఉంటుంది…

108 మంది పోటీదారుల నుంచి 10 మంది సెమీ ఫైనలిస్టులు, మొత్తం 40 మంది క్వార్టర్ ఫైనల్స్ కు చేరుతారు. కొందరు పోటీదారులు ఫాస్ట్-ట్రాక్ ఛాలెంజ్‌ల ద్వారా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌ కు చేరుకున్నారు. మిగిలిన సెమీఫైనలిస్టులు వ్యక్తిగత ఇంటర్వ్యూల తర్వాత జడ్జ్ ల ప్యానెల్ ద్వారా ఎంపిక చేయబడతారు, మరియు ఫైనల్ షో సమయంలో వెల్లడిస్తారు. ఖండాల వారీగా టాపర్స్ ను ఎంపిక చేసి… ఆపై ఒకరిని కొత్త మిస్ వరల్డ్ గా ప్రకటిస్తారు. ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా (71వ మిస్ వరల్డ్) కొత్త మిస్ వరల్డ్ విజేతకు కిరీటం అందజేస్తారు.

మిస్ వరల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన ఫెస్టివల్‌గా ప్రతీయేటా నిలుస్తోంది. కేవలం అందానికి మాత్రమే ప్రాముఖ్యత కాకుండా…తెలివితేటలు, సామాజిక న్యాయం, సాంస్కృతిక మార్పిడి, నాయకత్వ లక్షణాల ద్వారా మహిళలను సాధికారతను చేస్తుందని నిర్వహకులు తెలిపారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం