ప్రియుడితో కలిసి తల్లిని దారుణంగా హత్య చేసిన పదో తరగతి బాలిక.. సుత్తితో తలపై కొట్టి, కత్తితో పీక కోసి!-minor girl killed mother brutally with boy friend in medchal district jeedimetla because of love ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ప్రియుడితో కలిసి తల్లిని దారుణంగా హత్య చేసిన పదో తరగతి బాలిక.. సుత్తితో తలపై కొట్టి, కత్తితో పీక కోసి!

ప్రియుడితో కలిసి తల్లిని దారుణంగా హత్య చేసిన పదో తరగతి బాలిక.. సుత్తితో తలపై కొట్టి, కత్తితో పీక కోసి!

Anand Sai HT Telugu

రోజురోజుకు మానవ సంబంధాలు దారుణంగా తయారవుతున్నాయి. చిన్న కారణాలకే తల్లిదండ్రులనే పిల్లలు చంపే పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా తెలంగాణలో ఘోరమైన ఘటన జరిగింది. తల్లిని పదో తరగతి బాలిక చంపేసింది.

ప్రతీకాత్మక చిత్రం

తెలిసి తెలియని వయసులో వచ్చే ఆకర్శణతో అయిన వాళ్లనే చంపుకొంటున్నారు. ప్రేమ పేరుతో ఆవేశంలో కన్నవాళ్లనే కడతేరుస్తు్న్నారు. చిన్న వయసులో ప్రేమ పడటం తల్లిదండ్రులు అడ్డు చెబితే చావడమో.. చంపడమో చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ప్రేమ వ్యవహారంలో పదో తరగతి బాలికను తల్లి మందలించడంతో చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్దాం..

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్‌బీ నగర్‌లో అర్ధరాత్రి హత్య జరిగింది. అయితే పోలీసులు కేసు విచారణ చేస్తుండగా విస్తూపోయే విషయాలు తెలిశాయి. వివరాలు తెలిసి అందరూ షాక్ అయ్యారు. పదో తరగతి బాలికనే ఈ హత్యకు కారణమని తెలిసింది.

ఎన్ఎల్‌బీ నగర్‌లో సట్ల అంజలి(39) తన కుమార్తెతో కలిసి నివాసం ఉంటోంది. బాలిక పదో తరగతి చదువుతోంది. శివ అనే 19 ఏళ్ల వ్యక్తితో బాలికకు పరిచయం ఉంది. 8 నెలల క్రియేత బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో శివ పరిచయం అయినట్టుగా తెలుస్తోంది. పదో తరగతికే ప్రేమ ఏంటని మందలించింది తల్లి. వారం క్రితం శివతో బాలిక వెళ్లపోయింది. జీడిమెట్ల పీఎస్‌లో కేసు కూడా నమోదు అయింది. మూడ్రోజుల క్రితం తిరిగి వచ్చింది బాలిక. తల్లి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్‌ వేసింది.

ఈ వయసులో అలాంటి పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరించింది. శివను కలవొద్దని, ప్రేమ వ్యవహారంలాంటి వాటి జొలికి వెళ్లకూడదని చెప్పింది. దీంతో ప్రియుడికి దూరమవుతానని బాలిక ఆలోచన చేసింది. తల్లి హత్యకు ప్లాన్ చేసింది.

ఎలాగైనా తల్లిని చంపేయాలనుకుంది బాలిక. ఈ విషయాన్ని ప్రియుడు శివతో కూడా మాట్లాడింది. ప్రియుడు శివతోపాటుగా అతడి సోదరుడు యశ్వంత్‌తో కలిసి తల్లిని చంపాలనుకుంది. సోమవారం రాత్రి నల్గొండ నుంచి ప్రియుడు శివ వచ్చాడు. ఇంట్లో తల్లి అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్‌షీట్‌తో అంజలి ముఖాన్ని కప్పాడు. సుత్తితో తల్లి తలపై కొట్టింది బాలిక. కత్తితో పీక కోశాడు శివ తమ్ముడు యశ్వంత్‌.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.