Ration Cards : రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా తొలివిడతలో మండలానికి ఒక గ్రామం చొప్పున రైతు భరోసా సొమ్ము విడుదల చేసినట్లు చెప్పారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు రూ.530 కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల తెలియజేశారు.
501 గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మొదటి రోజు 20,336 మంది భూమిలేని కూలీల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున జమచేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు 15,414 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు మంత్రి చెప్పారు. కొత్త కార్డుల్లో 51,912 మందికి ఫిబ్రవరి నుంచి రేషన్ పంపిణీ చేస్తామన్నారు. మొదటి రోజు మండలానికి ఒక గ్రామం చొప్పున కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు. పాత రేషన్ కార్డుల్లో సవరణలు చేసి 1.03 లక్షల మంది పేర్లు చేర్చారన్నారు.
పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ను ప్రారంభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అర్హులైన అన్నదాతలకు ఏడాదికి రూ. 12వేల సాయం అందించనుంది.
సంబంధిత కథనం