TG Farmers : తెలంగాణ రైతులకు మరో శుభవార్త.. వారికి కూడా త్వరలో రుణమాఫీ!-minister tummala nageswara rao announced that farmers in telangana with debts of more than rs 2 lakh will be waived off ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Farmers : తెలంగాణ రైతులకు మరో శుభవార్త.. వారికి కూడా త్వరలో రుణమాఫీ!

TG Farmers : తెలంగాణ రైతులకు మరో శుభవార్త.. వారికి కూడా త్వరలో రుణమాఫీ!

Basani Shiva Kumar HT Telugu
Nov 15, 2024 02:20 PM IST

TG Farmers : తెలంగాణలో రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల వివరించారు. త్వరలోనే అందరు రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ముందు నిలిచిందని వ్యాఖ్యానించారు. రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్టు స్పష్టం చేశారు.

రైతులకు మరో శుభవార్త
రైతులకు మరో శుభవార్త

తెలంగాణలో రూ.2 లక్షల లోపు రైతుల రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారికి కూడా త్వరలోనే మాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులకు మేలు జరగాలనే ప్రభుత్వం కోరుకుంటుందని.. రైతులు వారి ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు.

'చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ముందు నిలిచింది. పంజాబ్ , హర్యానా రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువ ధాన్యం ఉత్పత్తి అయ్యింది. 40 లక్షల ఎకరాల్లో సన్నం ధాన్యం సాగు అయ్యింది. జనవరి నుంచి సన్న బియ్యం ఇవ్వాలనీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. 17 శాతం తేమ కంటే ఎక్కువ ఉన్నా.. రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నాం' అని తుమ్మల నాగేశ్వర రావు వివరించారు.

'గత ప్రభుత్వ హయం కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 7411 కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు జరుగుతుంది. ఇప్పటి వరకు 420 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. రూ.622 కోట్లు ప్రభుత్వం రైతులకు చెల్లించింది. రూ.500 బోనస్‌ను అదనంగా రైతులకు చెల్లిస్తుంది. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది' అని తుమ్మల స్పష్టం చేశారు.

'పత్తి దిగుబడి తగ్గినా కొనుగోలులో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. లబ్ధి కోసం ప్రతిపక్షాలు రాజకీయ క్రీడలను మానుకోవాలి. ఒక్క రూపాయి ఎక్కువ వస్తుందంటే రైతులు ఓపెన్ మార్కెట్ కి వెళ్తారు.రైతులు లాభ పడాలనుకోవడంలో తప్పు లేదు. మిల్లర్ల సమస్యల మీద ఇప్పటికే చర్చించాం. మిల్లర్ల కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు' అని తుమ్మల వ్యాఖ్యానించారు.

Whats_app_banner