Kisan Agri Show 2025 : తెలంగాణలోనే అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన.. ప్రారంభించిన మంత్రి తుమ్మల-minister tummala inaugurates telangana largest agricultural exhibition kisan agri show 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kisan Agri Show 2025 : తెలంగాణలోనే అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన.. ప్రారంభించిన మంత్రి తుమ్మల

Kisan Agri Show 2025 : తెలంగాణలోనే అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన.. ప్రారంభించిన మంత్రి తుమ్మల

Basani Shiva Kumar HT Telugu
Published Feb 07, 2025 03:51 PM IST

Kisan Agri Show 2025 : కిసాన్ అగ్రి షో 2025ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగునుంది. వ్యవసాయ రంగ ప్రముఖులు, రైతులు, ఆవిష్కర్తలు దీంట్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

కిసాన్ అగ్రి షో 2025
కిసాన్ అగ్రి షో 2025

హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్స్ సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక "కిసాన్ అగ్రి షో 2025"ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కిసాన్ ఫోరం ప్రైవేట్ లిమిటెడ్ కన్వీనర్ నిరంజన్ దేశ్‌పాండేతో కలిసి ప్రారంభించారు. వ్యవసాయ రంగ ప్రముఖులు, నిపుణులు, మార్గదర్శకులు, రైతులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి.. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 9న ముగుస్తుంది. ఈ ఈవెంట్‌ వ్యవసాయంలో అత్యాధునిక పురోగతిపై చర్చలు, సహకారం, పరిశోధనకు ప్రోత్సాహకరంగా పనిచేయనుంది.

విభిన్న ప్రదర్శనకారులకు వేదిక..

కిసాన్ హైదరాబాద్ 2025.. వ్యవసాయ రంగంలోని విభిన్న ప్రదర్శనకారులకు వేదిక కానుంది. ఈ ప్రదర్శనలో వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు , పనిముట్లు, నీరు - నీటిపారుదల పరిష్కారాలు, ప్లాస్టికల్చర్, వివిధ సాధనాలు, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయంలో ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, కాంట్రాక్ట్ వ్యవసాయ పరిష్కారాలు, వ్యవసాయ ఇన్‌పుట్‌లు, రక్షిత సాగు సాంకేతికతల తోపాటు.. వ్యవసాయం కోసం మొబైల్ యాప్‌లు, కస్టమ్ క్లియరెన్స్ సేవలను ప్రదర్శించనున్నారు.

స్థిరమైన వృద్ధికి..

కిసాన్ అగ్రి షో ప్రారంభం సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. "కిసాన్ హైదరాబాద్.. వ్యవసాయంలో విభిన్న వాటాదారులను ఒకచోట చేర్చిన వినూత్న ప్రయత్నం. ఈ కార్యక్రమంలో ఆవిష్కరణలను ప్రదర్శించడమే కాకుండా.. వ్యవసాయ రంగం స్థిరమైన వృద్ధికి అవసరమైన చర్చలను కూడా సులభతరం చేసింది" అని వ్యాఖ్యానించారు.

ఆవిష్కరణలను అన్వేషించే వేదిక..

కిసాన్ హైదరాబాద్ 2025 విజయాన్ని ప్రస్తావిస్తూ.. కిసాన్ ఫోరం ప్రైవేట్ లిమిటెడ్ కన్వీనర్ నిరంజన్ దేశ్‌పాండే సంతోషాన్ని వ్యక్తం చేశారు. "కిసాన్ హైదరాబాద్ 2025కి లభిస్తున్న స్పందన చూసి సంతృప్తిగా ఉంది. ఈ కార్యక్రమం కేవలం ఒక ప్రదర్శన కాదు. అంతకంటే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది వ్యవసాయ భవిష్యత్తు కార్యాచరణకి ప్రణాళికను రూపొందించుకునే అద్భుత వేదిక. ప్రధానంగా వ్యవసాయ రంగంలోని ఆవిష్కరణలను అన్వేషించే ఒక అధునాతన వ్యవస్థ" అని వివరించారు.

తెలంగాణ వ్యవసాయ శాఖ, తెలంగాణ ఉద్యానవన శాఖ, తెలంగాణ సెరికల్చర్ విభాగం, తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజల పెంపకందారుల సమాఖ్య, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు.. మరి కొన్ని సంస్థలు ఈ వ్యవసాయ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.

Whats_app_banner