Hyderabad : క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు! అండగా ఉంటానని భరోసా-minister sridhar babu sheds tears after hearing the words of a cancer victim ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు! అండగా ఉంటానని భరోసా

Hyderabad : క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు! అండగా ఉంటానని భరోసా

Hyderabad : క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. బాధితుడి కోరిక మేరకు క్రికెట్ కిట్ అందజేశారు. అన్నగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాలని సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉలా ఉన్నాయి.

నితిన్‌కు క్రికెట్ కిట్ అందిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు

'సార్ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పెద్ద క్రికెటర్ కావాలని కలగన్నా.. నాకో క్రికెట్ కిట్ ఇప్పించండి సార్' క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ యువకుడి మాటలివి. ఈ మాటలు వింటే మనసున్న ప్రతీ మనిషికీ గుండె తల్లడిల్లక మానదు. ఈ మాటలు విని మంత్రి శ్రీధర్ బాబు ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. భూపాలపల్లి జిల్లా పాలిమల మండలం సర్వాయ్ పేట గ్రామానికి చెందిన భౌత్ నితిన్.. కాన్సర్‌తో బాధపడుతున్నారు.

శ్రీధర్ బాబు కన్నీళ్లు..

హైదరాబాద్ ఖాజాగూడలోని ఓ ఆసుపత్రిలో నితిన్ చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు.. స్వయంగా ఆసుపత్రికెళ్లి పరామర్శించారు. తానున్నానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నితిన్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న శ్రీధర్ బాబు.. అప్పటికప్పుడు క్రికెట్ కిట్ తెప్పించి అతని కోరికను నెరవేర్చారు. సొంతన్నగా ఉండగా నిలుస్తానని.. ఏ అవసరమున్నా నేరుగా తనను సంప్రదించాలని నితిన్ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.

ధైర్యం చెప్పిన మంత్రి..

చికిత్స అందిస్తున్న తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. 'ఏం కాదు.. అంతా మంచే జరుగుతుందని నితిన్, అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబును చూసి నితిన్, అతని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. వారిని మంత్రి ఓదార్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

క్యాన్సర్ భయంకరం..

క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి. ఇది శరీరంలోని కణాలు అదుపులేకుండా వృద్ధి చెందడం వల్ల వస్తుంది. ఈ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి, ప్రాణాంతకం కావచ్చు. క్యాన్సర్ అనేక రకాలుగా ఉంటుంది.

క్యాన్సర్ రకాలు..

కార్సినోమా- చర్మం లేదా అవయవాల కణజాలంలో ప్రారంభమయ్యే క్యాన్సర్. ఇందులో బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమా వంటి ఉప రకాలు ఉన్నాయి.

సార్కోమా- ఎముకలు, కండరాలు, కొవ్వు కణజాలం లేదా మృదులాస్థి వంటి సంయోజక కణజాలంలో ప్రారంభమయ్యే క్యాన్సర్.

లుకేమియా- ఎముక మజ్జలో రక్త కణాలను తయారు చేసే కణజాలంలో ప్రారంభమయ్యే క్యాన్సర్. ఇది తెల్ల రక్త కణాలలో వస్తుంది.

లింఫోమా, మైలోమా- రోగనిరోధక వ్యవస్థ కణాలలో ప్రారంభమయ్యే క్యాన్సర్.

మెదడు, వెన్నుపాము క్యాన్సర్లు- మెదడు, వెన్నుపాము కణజాలంలో ప్రారంభమయ్యే క్యాన్సర్. ఇవన్నీ ప్రమాదకరం. వీటికి వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.