Minister Seethakka: వెయ్యేళ్లు గుర్తుండేలా మేడారం శిలాశాసనాలు..వంద ఎకరాల్లో ఆలయం అభివృద్ధి చేస్తామన్న సీతక్క
Minister Seethakka: మేడారం Medaram ఆలయాన్ని వంద ఎకరాల్లో అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే 50 ఎకరాల భూసేకరణ పూర్తయిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
Minister Seethakka: సమ్మక్క– సారలమ్మ Sammakka Saralamma యుద్ద పోరాటం, తల్లుల చరిత్ర వెయ్యి ఏళ్లు గుర్తుండిపోయేలా శిలాశాసనం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మేడారం మహాజాతర అసలైన ఘట్టం ఆవిష్కృతం కానుండటంతో మేడారంలో జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంద ఎకరాల్లో ఆలయ అభివృద్ధికి అవసరమైన మరో 50 ఎకరాల సేకరణ నిమిత్తం రైతులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. జాతర అనంతరం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై రాన్నున మినీ జాతర కల్లా మేడారం Medaram అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
బుధవారం సాయంత్రం కన్నెపల్లీ నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజులు గద్దెల పైకి చేరుకుంటారన్నారు. 22న చిలకులగుట్ట నుంచి సమ్మక్క తల్లిని ఎస్పీ గౌరవ వందనం తో గాలిలో తుపాకీ పేల్చి , పూజారులు గిరిజన సంప్రదాయాలతో సమ్మక్క తల్లిని వనం నుంచి గద్దె పైకి అంగరంగా వైభవంగా తీసుకొస్తారన్నారు.
23న అమ్మవార్లు గద్దెలపై కొలువు తీరుతారని, అదే రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారన్నరు. 24న తిరిగి అమ్మవార్లు వన ప్రవేశం చేస్తారని మంత్రి తెలిపారు.
దర్శనానికి క్రమ శిక్షణ పాటించాలి
భక్తులు స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ అమ్మవార్ల దర్శనం చేసుకోవాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఈ మహాజాతరకు బస్సులు, ఎడ్ల బండ్లు, వ్యాన్ లు వివిధ వాహనాల ద్వారా జాతరకు లక్షలాది మంది ఇప్పటికే చేరుకున్నారని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రవాణాకు ఇబ్బందులు లేకుండా రోడ్లు వెడల్పు చేశామన్నారు.
హనుమకొండ నుంచి పస్రా, తాడ్వాయి నుంచి మేడారం వరకు 4 లైన్ల రోడ్లు వెడల్పు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు ఊరట్టం నుంచి పార్కింగ్ స్పాట్లు అందుబాటులోకి తెచ్చామని సీతక్క పేర్కొన్నారు. మంచి నీటి సౌకర్యాన్ని ఎక్కువగా పెంచినట్లు తెలిపారు. భక్తులకు బంగారం పంపిణీకి రద్దీ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
జాతీయ పండుగ గుర్తించేందుకు ప్రతిపాదనలు
ఆసియాలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరను జాతీయ పండుగగా National festivalగుర్తించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. జాతర నిర్వహణకు భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి రూ.110 కోట్లను కేటాయించారన్నారు.
అమ్మవార్ల దర్శనానికి కోట్లాదిగా తరలివస్తున్నారని తెలిపారు. దీంతోనే ములుగు జిల్లాల్లో మహాజాతర జరిగే నాలుగు రోజులు సెలవులు ప్రకటించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రులు , గవర్నర్ లు అమ్మవార్ల దర్శనానికి రాన్నునట్లు ఆమె తెలిపారు.
వీఐపీలకు పాసులు
వీఐపీల VIPకు పాసులు ఇస్తున్నామని, వారు సామాన్యులకు ఇబ్బంది కలగకుండా దర్శనం చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. జాతరలో 16 వేల మంది కింది స్థాయి సిబ్బంది పనిచేస్తున్నట్లు వివరించారు. అలాగే మరో 12 వేల మంది పోలీసు సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. శానిటేషన్, స్నానఘట్టాలు, మీడియా పాయింట్, తాగునీరు, అన్నింటి పరిధి పెంచినట్లు చెప్పారు.
40 బైక్ అంబులెన్స్ లను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యూ లైన్ లను విస్తృతంగా ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా మేడారంలో పచ్చదనం, పర్యావరణం పెంపొందేలా జంపన్న వాగు వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజ, తదితరులు పాల్గొన్నారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)