Telangana EV Policy : ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, పన్ను మినహాయింపు- రేపటి నుంచి తెలంగాణలో ఈవీ పాలసీ అమల్లోకి-minister ponnam prabhakar announced tg ev policy registration fee tax exemption upto 2026 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Ev Policy : ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, పన్ను మినహాయింపు- రేపటి నుంచి తెలంగాణలో ఈవీ పాలసీ అమల్లోకి

Telangana EV Policy : ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, పన్ను మినహాయింపు- రేపటి నుంచి తెలంగాణలో ఈవీ పాలసీ అమల్లోకి

Bandaru Satyaprasad HT Telugu
Nov 17, 2024 05:48 PM IST

Telangana EV Policy : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో నెం.41 ద్వారా రెండేళ్ల పాటు ఈవీ పాలసీ అమల్లో ఉంటుందన్నారు. ఈవీ వాహనాలకు వందశాతం పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, పన్ను మినహాయింపు- రేపటి నుంచి తెలంగాణలో ఈవీ పాలసీ అమల్లోకి
ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, పన్ను మినహాయింపు- రేపటి నుంచి తెలంగాణలో ఈవీ పాలసీ అమల్లోకి

తెలంగాణలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) పాలసీ తీసుకొచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పాలసీ నవంబర్ 18, 2024 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు అమల్లో ఉంటుందన్నారు. ఈ పాలసీ ప్రకారం ఈవీల్లో టూ వీలర్స్, 4 వీలర్స్, కమర్షియల్ వాహనాలకు వందశాతం పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. వీటితో పాటు ఈవీల రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు ఇస్తున్నామని ప్రకటించారు. జీవో నెంబర్ 41 ద్వారా ఈవీ పాలసీ అమల్లోకి తెస్తున్నామన్నారు.

హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ...దిల్లీ మాదిరిగా హైదరాబాద్ లో కాలుష్యం రాకుండా ఉండేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు. బైక్ లు , ఆటో , ట్రాన్స్ పోర్ట్ , బస్సులకు వందశాతం పన్ను మినహాయింపు ఇస్తున్నామన్నారు. అలాగే జంట నగరాల్లో ఈవీ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.

" తెలంగాణలో రవాణా శాఖ పరంగా మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు చేపడుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం. దిల్లీ మాదిరిగా హైదరాబాద్ కాలుష్యం రాకుండా ఉండేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చాం. గతంలో 2020-2030 ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకొచ్చారు. జీవో నెంబర్ 41 ద్వారా ఈవీ పాలసీ 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. రేపటి నుంచి ఈ జీవో ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమలులోకి వస్తుంది. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి లేదు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మార్చాలని ప్రణాళికలు తెచ్చాం"- మంత్రి పొన్నం ప్రభాకర్

ఎలక్ట్రిక్ 4 వీలర్స్ ,2 వీలార్స్, ఎలక్ట్రిక్ కమెరిష్యల్ వెహికిల్ ,ట్రై గూడ్స్ వెహికిల్ ,ఎలక్ట్రిక్ వెహికిల్ ఎలాంటి టాక్స్ లు మినహాయింపు ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులు కొన్నట్లైతే, కార్లు ఆర్టీసీ బస్సులు, సంస్థల బస్సులు 100 టాక్స్ మినహాయింపు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. హైదరాబాద్ లో వాయు కాలుష్యంగా 83, పఠాన్ చెరులో 72 కాలుష్యం ఉందన్నారు. కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవీపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలన్నారు.

హైదరాబాద్ లో ఇప్పుడున్న మూడు వేల బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. త్వరలోనే సిటీలో మొత్తం ఆర్టీసీ బస్సులు నడుస్తాయన్నారు. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సి ఉందన్నారు.

"ఇప్పటి వరకు పరిమితి సంఖ్యలోనే ఎలక్ట్రిక్ వాహనాల వాడుతున్నారు. 2026 డిసెంబర్ 31 వరకు ఈవీ పాలసీ ఉంటుంది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ మాత్రమే కాకుండా తెలంగాణ మొత్తం ఈవీ పాలసీ ఉంటుంది. ఈవీ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నాం. భవిష్యత్ తరాలకు కాలుష్యం నుంచి కాపాడుకుందాం. వాహనాలు 15 సంవత్సరాల దాటిన వాటికి స్క్రాప్ చేయాలని పాలసీ తెచ్చాం. ఆటోమాటిక్ టెస్టింగ్ సెంటర్స్ తెస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున అనుమతి తీసుకొని క్షేత్ర స్థాయిలో 4 రాష్ట్రాల్లో పర్యటించి బెస్ట్ ఈవీ పాలసీ తెస్తున్నాము. వాహన సారథిలో కూడా 29 రాష్ట్రాల్లో తెలంగాణ చేరుతుంది."- మంత్రి పొన్నం ప్రభాకర్

వాహనదారులు పొల్యూషన్ టెస్ట్ చేసుకునేలా అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. దేశంలో లక్ష 50 వేల మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారన్నారు. తెలంగాణలో రోజుకు 20 మంది చనిపోతున్నారన్నారు. యునిసెఫ్ ద్వారా స్కూల్ లలో రోడ్డు అవెర్నెస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

రవాణా శాఖకు కొత్త లోగో, కొత్త వాహనాలు వస్తున్నాయన్నారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. రేపటి నుంచి ఎలక్రిక్ వాహనాలు అన్ లిమిటెడ్ గా కొనుక్కోవచ్చన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటున్నాయన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు చొరవ తీసుకొని ఛార్జింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.

రవాణా శాఖలో ప్రమోషన్లు

"ఈవీ వాహనాలకు గతంలో 5 వేల వెహికల్స్ వరకు టాక్స్ మినహాయింపు ఇచ్చారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కడైనా ఒకటి ప్రమాదం జరిగితే ప్రజల మధ్య అపోహ సృష్టించద్దు. రవాణా శాఖ ప్రమోషన్లకు వ్యతిరేకం కాదు. అందరికీ ప్రమోషన్ లు ఇస్తాం. ప్రాసెస్ నడుస్తుంది. పొల్యూషన్ చెకప్ చేసే వాహనాలు సరిగా చేయడం లేదనే ఆటోమాటిక్ టెస్టింగ్ సెంటర్స్ తీసుకొస్తున్నాం. ఇప్పటికే రవాణా శాఖలో 58 కానిస్టేబుల్ నియామకం జరిగాయి . ఏఎమ్వీఐల నియామకాలు జరిగాయి."- మంత్రి పొన్నం ప్రభాకర్

Whats_app_banner