Ponguleti Srinivas Reddy : ఫోన్ ట్యాపింగ్, ధరణి ఫైళ్లు రెడీ, ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలనున్నాయ్-పొంగులేటి-minister ponguleti srinivas reddy sensational comments on political bombs explore in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ponguleti Srinivas Reddy : ఫోన్ ట్యాపింగ్, ధరణి ఫైళ్లు రెడీ, ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలనున్నాయ్-పొంగులేటి

Ponguleti Srinivas Reddy : ఫోన్ ట్యాపింగ్, ధరణి ఫైళ్లు రెడీ, ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలనున్నాయ్-పొంగులేటి

Bandaru Satyaprasad HT Telugu
Oct 23, 2024 10:56 PM IST

Minister Ponguleti Srinivas Reddy : ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలనున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, ధరళి, కాళేశ్వరంపై ప్రధాన నేతలపై చర్యలు తప్పవని హెచ్చిరించారు.

ఫోన్ ట్యాపింగ్, ధరణి ఫైళ్లు రెడీ, ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలనున్నాయ్-పొంగులేటి
ఫోన్ ట్యాపింగ్, ధరణి ఫైళ్లు రెడీ, ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలనున్నాయ్-పొంగులేటి

ఒక‌టి రెండు రోజుల్లో తెలంగాణలో పొలిటిక‌ల్ బాంబులు పేల‌నున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ప్రధాన నాయ‌కుల‌పై చ‌ర్యలు త‌ప్పవన్నారు. ఆధారాల‌తో ఫైళ్లు సిద్దమయ్యాయని తెలిపారు. ఓ ఛానల్ ఇంట‌ర్య్వూలో పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

yearly horoscope entry point

'ఎంతటి వాళ్లైనా తప్పు చేస్తే తప్పించుకోలేరు.సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ సిద్ధమయ్యాయి. కక్ష సాధింపు కోసం కాదు, సాక్ష్యాధారాలతోనే చర్యలు తీసుకుంటాం. ఫోన్‌ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో ప్రధాన నేతలపై చర్యలు' ఉంటాయని మంత్రి పొంగులేటి అన్నారు.

తెలంగాణలో దీపావళికి ముందే పొలిటికల్ బాంబ్ లు పేలనున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దక్షిణ కొరియా సియోల్‌లో హ‌న్ న‌ది పున‌రుజ్జీవ‌న ప‌రిస్థితుల‌ను అధ్యయ‌నం చేయ‌డానికి వెళ్లిన మంత్రి పొంగులేటి అక్కడ ఓ తెలుగు జాతీయ ఛాన‌ల్ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌, కాళేశ్వరం ప్రాజెక్ట్, ధ‌ర‌ణి వంటి సుమారు 8 నుంచి 10 ప్రధాన పాయింట్లలో ఈ చ‌ర్యలు ఉంటాయ‌న్నారు. దీనికి సంబంధించి ఫైళ్లు పూర్తి సాక్ష్యాధారాల‌తో సిద్ధమ‌య్యాయ‌ని మంత్రి పొంగులేటి వివ‌రించారు.

మరో రెండు రోజుల్లో

సియోల్ నుంచి మ‌రో 2 రోజుల్లో హైద‌రాబాద్ చేరేస‌రిక‌ల్లా చ‌ర్యలు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. కేవ‌లం క‌క్ష సాధింపులా గాక పూర్తిగా ఆధారాల‌తో చ‌ర్యలు ఉంటాయ‌ని, ఎంత‌టివారినైనా ఉపేక్షించేదిలేద‌న్నారు. తొంద‌ర‌ప‌డి ఎటువంటి ఆధారాలు లేకుండా వెళ్లబోమ‌న్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి విచార‌ణ దాదాపు పూర్తయిందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌, కాళేశ్వరం ప్రాజెక్ట్, ధ‌ర‌ణి వంటి అంశాలు ట్రాక్‌లో ఉన్నాయ‌ని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రజ‌లు ఇంత‌వ‌ర‌కు ఎటువంటి చ‌ర్యలు లేవ‌ని భావించ‌వ‌ద్దని, వారు కోరుకునే విధంగా పూర్తి ఆధారాల‌తో ముఖ్యమైన ఫైళ్లు సాయంతో ముందుకు వెళ్లబోతున్నామ‌ని మంత్రి పొంగులేటి సంచలన కామెంట్స్ చేశారు.

Whats_app_banner