KTR Tweet: తాంత్రిక పూజలన్న సంజయ్.. బెడ్ రెడీ అంటూ కేటీఆర్ సెటైర్లు-minister ktr serious tweet on bandi sanjay comments ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Minister Ktr Serious Tweet On Bandi Sanjay Comments

KTR Tweet: తాంత్రిక పూజలన్న సంజయ్.. బెడ్ రెడీ అంటూ కేటీఆర్ సెటైర్లు

బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్ (ఫైల్ ఫొటో)
బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్ (ఫైల్ ఫొటో) (twitter)

ktr tweet on bandi sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్… చర్చనీయాంశంగా మారింది.

KTR Tweet On Bandi Sanjay: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పార్టీ నేతలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. బండి సంజయ్‌ను ఇలాగే వదిలేయకండి బీజేపీ బాబులూ అంటూ ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

బండి సంజయ్ వ్యాఖ్యలు

మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ టీఆర్ఎస్ టార్గెట్ గా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేసి ద్రవాలను తీసుకెళ్లి కాళేశ్వరంలో కలిపారని ఆరోపించారు. తాంత్రికులు చెప్పారని... కేవలం కేసీఆర్ కుటుంబ స్వార్థం కోసం టీఆర్ఎస్ పేరును కూడా బీఆర్ఎస్ గా మార్చారంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్... ట్విట్టర్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

'ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు. పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో; మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు ఎర్రగడ్డలో బెడ్ తయారుగ ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

గుజరాత్‌లో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటుపై ట్వీట్‌ చేశారు మంత్రి కేటీఆర్. బోర్డులు గుజరాత్‌కు.. బోడిగుండులు తెలంగాణకా? అని వ్యంగ్యంగా విమర్శించారు. మోదీ గుండెల్లో గుజరాత్‌.. తెలంగాణ గుండెల్లో గునపాలా? ఎన్నాళ్లీ దగా? ఇంకెన్నాళ్లీ మోసం? అంటూ నిలదీస్తూ ట్వీట్ చేశారు.