Harish rao Comments : ఏపీ మంత్రిగారూ...మీరు మా జోలికి రాకండి, అది మీకే మంచిది-minister harish rao shocking comments on situations in ap ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Harish Rao Shocking Comments On Situations In Ap

Harish rao Comments : ఏపీ మంత్రిగారూ...మీరు మా జోలికి రాకండి, అది మీకే మంచిది

HT Telugu Desk HT Telugu
Apr 12, 2023 04:10 PM IST

Minister Harish Rao Comments: ఏపీని ఉద్దేశించి మంత్రి హరీశ్ రావ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు రాద్దాంతం చేస్తున్నారన్న ఆయన…ప్రత్యేక హోదా విషయంలో అధికార పార్టీకి చురకలు అంటించారు.

మంత్రి హరీశ్ రావ్
మంత్రి హరీశ్ రావ్

Minister Harish Rao Shocking Comments: ఏపీకి చెందినవారు తెలంగాణలో ఓట్లు తీసుకోవాలంటూ హరీశ్ రావ్ చేసిన వ్యాఖ్యలపై డైలాగ్ వార్ నడుస్తోంది. హరీశ్ మంగళవారం చేసిన కామెంట్స్ పై ఏపీ మంత్రులు ఫైర్ అవుతుండగా.... మరోసారి మంత్రి హరీశ్ రావ్ స్పందించారు. తాను ఏమన్నానని ఆంధ్రా మంత్రులు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని నిలదీశారు. తమ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందని... 56 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని చెప్పారు. రైతు బీమా, రైతు బంధు ఉందంటూ మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు. తమ దగ్గర ఇవన్నీ ఉన్నాయంని...మీ దగ్గర ఏమున్నాయంటూ ఏపీ మంత్రులను ఎదురు ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు

"నా వ్యాఖ్యలపై స్పందించిన ఓ ఏపీ మంత్రి అంటుండు.. మీ తెలంగాణలో ఏం ఉందని ప్రశ్నించాడు. మా దగ్గర 56 లక్షల ఎకరాల యాసంగి పంట ఉంది మంత్రి గారు. ఆడపిల్లకు కల్యాణ లక్ష్మీ ఇస్తున్నాం. మా దగ్గర కేసీఆర్ కిట్ ఉంది మంత్రి గారు. ఏకరానికి పది వేలు ఇచ్చే రైతుబంధు ఉంది మంత్రి గారు. ఐదు లక్షలు ఇచ్చే రైతుబీమా కూడా ఉంది. 26 మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేశాం. ప్రపంచమే అబ్బురంపడేలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మూడేళ్లలోనే పూర్తి చేశాం మంత్రిగారూ. మీ దగ్గర ఏం ఉంది మంత్రిగారూ..? విశాఖ ఉక్కుపై మాట్లాడరు. ప్రత్యేక హోదా కేంద్రం ఎగబెట్టిన ఏం అడగరు. విశాఖ ఉక్కును తుక్కుకి అమ్మిన ఎవ్వరు అడగరు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రశ్నించరు. ప్రజలను గాలికి వదిలేశారు.. మీ ప్రయోజనాలు చూసుకుంటున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కలిసి ఏపీని ఆగం చేశాయి. అలాంటి మీరు మా జోలికి రాకండి. మా గురించి మాట్లాడకపతే అది మీకే మంచింది" అంటూ ఘాటుగా బదులిచ్చారు హరీశ్ రావ్.

ఏపీలో  పాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసని మంత్రి హరీశ్‌రావు మంగళవారం కామెంట్స్ చేశారు. సంగారెడ్డిలో మేస్త్రీ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీని ఉద్దేశిస్తూ కొని వ్యాఖ్యలు చేశారు. అక్కడికి...ఇక్కడికి జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్ ఉందని చెప్పారు. అందుకే ఏపీలో ఓటు రద్దు చేసుకుని తెలంగాణలో నమోదు చేసుకోవాలని వారికి సూచించారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఏపీ మంత్రులు ఘాటుగా స్పందించారు. వారికి కామెంట్స్ ను ఉద్దేశిస్తూ…మంత్రి హరీశ్ గట్టి బదులిచ్చారు. 

 

IPL_Entry_Point