MHSRB Hall Tickets : వైద్యారోగ్యశాఖలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు - రాత పరీక్ష హాల్ టికెట్లు విడుదల, ఇదిగో లింక్
TG Lab Technician Recruitment 2024 : తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రాత పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నవంబర్ 10వ తేదీన ఎగ్జామ్ జరగనుంది.
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 రాత పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ బేస్ట్ విధానంలో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వివరాలను వెల్లడించింది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.20 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఎగ్జామ్ హాల్ లోకి మధ్యాహ్నం 1.30 నుంచి అభ్యర్థులను అనుమతిస్తారు. 2.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయనున్నారు. పరీక్ష పేపర్ ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉండవు. నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరని అధికారులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం https://mhsrb.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి…
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Click here to download Lab Technician Grade-II Recruitment Hall Ticket అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ Email-ID, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
ఈ నోటిఫికేషన్ 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులను రిక్రూట్ చేస్తారు. ఇందులో చూస్తే ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు ఉన్నాయి. ఇక వైద్య విధానపరిషత్‌లో 183, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులును భర్తీ చేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
ఈ పోస్టుల రాత పరీక్షను చూస్తే మొత్తం 100 పాయింట్ల ప్రాతిపదిన నియామకాలు ఉంటాయి. ఇందులో 80 పాయింట్లు రాత పరీక్ష ద్వారా, మరో 20 పాయింట్లు వెయిటేజీ కింద ఇస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిజేస్తే వెయిటెజీ కింద 20 పాయింట్స్ కేటాయించనున్నారు. రాత పరీక్ష, వెయిటీజీల మార్కులను పరిశీలించి తుది జాబితాను ప్రకటిస్తారు.