Shillong Summer Trip : షిల్లాంగ్ ట్రిప్ తో చిల్, డాకీ నదిలో బోటింగ్- మేఘాలయ టూర్ వివరాలివే!
Shillong Summer Trip : హాట్ సమ్మర్ లో కూల్ గా షిల్లాంగ్ లో మూడ్రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అయితే మేఘాలయ టూరిజయం మూడ్రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. షిల్లాంగ్ కొండల్లో,
Shillong Summer Trip : ఈ వేసవిలో కుటుంబంతో లేదా స్నేహితులు, బంధువులతో కలిసి ట్రిప్ నకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మేఘాలయ రాష్ట్రం మీకు వెల్ కమ్ చెబుతోంది. హాట్ సమ్మర్ ను కూల్ గా మార్చుకునేందుకు షిల్లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. కొండల్లో జాలువారే జలపాతాలు, స్వచ్ఛమైన పర్వత గాలి, మనస్సుకు ప్రశాంతత కలిగించే పచ్చదనం, గుండు పిన్ను వేసిన కనిపించేంత స్పష్టమైన నీరు కలిగిన ఉమ్ గోట్ నదిలో బోటింగ్, ట్రెక్కింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ మీలో నూతన ఉత్తేజాన్ని నింపుతాయి. రాత్రుళ్లు క్యాంప్ లలో స్టే చేస్తూ ఆకాశంలో మెరిసే నక్షత్రాలు చూస్తూ, కొండలపై నుంచి జారిపడే జలపాతాల శబ్ధాలు వినేందుకు ఒక్కసారైనా షిల్లాంగ్ టూర్ కు వెళ్లాల్సిందే.

మేఘాలయ టూరిజం షిల్లాంగ్, సోహ్రా, మావ్లిన్నోంగ్, డాకీ పర్యటక ప్రదేశాలు చూసేందుకు మూడ్రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది.
డే 1 : పర్యాటకులు షిల్లాంగ్ చేరుకుంటారు. షిల్లాంగ్ లోని హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. మీ మొదటి రోజు టూర్ లో షిల్లాంగ్ చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు సందర్శించవచ్చు.
షిల్లాంగ్ నగరంలో ఉండే వార్డ్స్ లేక్, బొటానికల్ గార్డెన్ సందర్శించవచ్చు. పోలీస్ బజార్ షాపింగ్, తినుబండారాల కోసం బెస్ట్ ప్లేస్.
షిల్లాంగ్ నుంచి 3.4 కి.మీ దూరంలో డాన్ బోస్కో మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం ఒక సాంస్కృతిక, విద్యా సంస్థ. ఈ ప్రాంతం గొప్ప చరిత్ర, కళను ఈ మ్యూజియం హైలైట్ చేస్తుంది. మ్యూజియంలో ఈశాన్య భారతదేశంలోని సంప్రదాయ కళలు, సంగీతం, నృత్యం వంటి సామాజిక, సాంస్కృతిక ప్రదర్శనాలు వీక్షించవచ్చు.
షిల్లాంగ్ పీక్
షిల్లాంగ్ నుంచి 10.6 కి.మీ దూరంలో షిల్లాంగ్ పీక్ ఉంది. షిల్లాంగ్ పీక్ మేఘాలయలో ఎత్తైన ప్రాంతం. ఈస్ట్ ఖాసీ హిల్స్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఎంతో సుందరమైన ప్రకృతి అందాలు, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల దృశ్యాలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. సముద్ర మట్టానికి 1965 మీటర్లు ఎత్తులో ఉన్న ఈ శిఖరం ట్రెక్కింగ్, హైకింగ్ కు బెస్ట్ ప్లేస్. ఈ శిఖరానికి చేరుకునే రెండు గంటల ప్రయాణంలో చుట్టుపక్కల కొండలు, లోయల చూడవచ్చు.
ఎలిఫెంట్ ఫాల్స్
ఎలిఫెంట్ ఫాల్స్ మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌లోని ఒక సుందరమైన వాటర్ ఫాల్స్. షిల్లాంగ్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతానికి అక్కడి ఏనుగు ఆకారంలోని రాతి నిర్మాణాల వల్ల ఎలిఫెట్ ఫాల్స్ అనే పేరు వచ్చింది. ఈ జలపాతం అందాలు, ప్రశాంతమైన పరిసరాలకు ప్రసిద్ధి. ఈ జలపాతం చుట్టూ అందమైన పచ్చని చెట్లు, దాదాపు 30 మీటర్ల ఎత్తు నుంచి జారిపడే నీరు ఎంతో అద్భుతంగా ఉంటాయి.
లైత్లం కాన్యోన్స్
షిల్లాంగ్ నుంచి 22.1 కిమీ దూరంలో లైత్లం కాన్యోన్స్ కొండలు ఉన్నాయి. మేఘాలయ తూర్పు ఖాసీ కొండలలో కనిపించే అందమైన కొండలు, లోయల ప్రాంతం. కాలక్రమేణా కోతకు గురైన కొండలు, నిటారుగా ఉండే లోయలు, గోర్జెస్ వరుసను కనిపిస్తాయి. ఈ లోయలు చుట్టుపక్కల ఉన్న పల్లెల ఎంతో అద్భుత దృశ్యాలను అందిస్తాయి.
డే 2 : సోహ్రా- షిల్లాంగ్ నుంచి 53.7 కి.మీ దూరంలో సోహ్రా ఉంటుంది. సోహ్రా మార్గంలో మాక్డోక్ డింపెప్ వ్యాలీని సందర్శించవచ్చు. డింపెప్ వ్యాలీ వ్యూ పాయింట్‌ను డువాన్ సింగ్ సియమ్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. కేవ్స్ గార్డెన్ లేదా కా బ్రి కి సిన్రాంగ్ అనేది మేఘాలయలోని జైంతియా హిల్స్‌లో కనిపించే సహజమైన గుహలు. ఈ గుహలు ఒక ప్రసిద్ధ పర్యాటక, సాహసాలకు ఆకర్షణగా ఉన్నాయి. సందర్శకులు ఈ గుహలలోని చీకటి, రహస్యమైన ప్రదేశాలను అన్వేషించవచ్చు. ఈ గుహలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను కలిగి ఉంటాయి, వివిధ స్థానిక కథలు, పురాణాలు వాటితో ముడిపడి ఉన్నాయి. సందర్శకులు చుట్టుపక్కల ప్రాంతంలో గుహల అన్వేషణ, ట్రెక్కింగ్ వంటి అనేక కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. మేఘాలయ సహజ సౌందర్యం, సాంస్కృతిక వారసత్వంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కా బ్రి కి సిన్రాంగ్ తప్పక చూడవలసిన ప్రదేశం. మార్గమధ్యలో అర్వా గుహ, నోహ్కలికై జలపాతం, వీసావ్‌డాంగ్ జలపాతం చూడవచ్చు.
డే 3 : సోహ్రా నుంచి మావ్లిన్నాంగ్, డాకీ వరకు టూర్
సోహ్రా నుండి 80 కి.మీ దూరంలో మావ్లిన్నాంగ్ గ్రామం ఉంది. ఇది పరిశుభ్రత, సహజ సౌందర్యం, విలక్షణమైన సమాజానికి ప్రసిద్ధి. మావ్లిన్నాంగ్ ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేరొంది. ఈ గ్రామం చుట్టూ పచ్చటి అడవులు, కొండలు, గ్రామీణ ప్రాంతాల అద్భుతమైన ప్రదేశాలు చూడవచ్చు. ఈ గ్రామంలో పాతకాలపు ఇళ్లు చూడవచ్చు. మావ్లిన్నాంగ్ సమీపంలోనే నోహ్వెట్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఉంది. మావ్లిన్నాంగ్ నుంచి 34.4 కి.మీ దూరంలో డాకీ టౌన్ ఉంది. ఈ టౌన్ గుండా ఉమ్‌గోట్ నది ప్రవహిస్తుంది. ఈ నది అత్యంత స్పష్టమైన నీటికి ప్రసిద్ధి. ఉమ్గోట్ నదిలో బోటింగ్, స్నార్కెలింగ్, చేపలు పట్టడం, స్విగ్మింగ్ చేయవచ్చు. డాకీలో క్యాంపింగ్ లేదా హోమ్‌స్టే లేదా హోటల్‌కి చెక్-ఇన్ చేయవచ్చు.
ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాల కోసం https://www.meghalayatourism.in/ వెబ్ సైట్ సందర్శించవచ్చు.
లేదా 7640003050, E-mail : info@meghalayatourism.in సంప్రదించవచ్చు.
సంబంధిత కథనం