Chiru Political Comments : మళ్లీ చిరంజీవి పొలిటికల్ కామెంట్స్.. అతడు సరైనోడు-megastar chiranjeevi latest political comments on pawan kalyan ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Megastar Chiranjeevi Latest Political Comments On Pawan Kalyan

Chiru Political Comments : మళ్లీ చిరంజీవి పొలిటికల్ కామెంట్స్.. అతడు సరైనోడు

HT Telugu Desk HT Telugu
Nov 20, 2022 05:21 PM IST

Chiranjeevi Political Comments : మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే ఈ సందర్భంగా పవన్ రాజకీయాలపైనా కామెంట్స్ చేశారు.

చిరంజీవి(ఫైల్ ఫొటో)
చిరంజీవి(ఫైల్ ఫొటో)

హైదరాబాద్(Hyderabad) ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్యా భవన్ లో నర్సాపూర్ వైఎన్ఎంపీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల అధ్యాపక బృందాన్ని, మిత్రులను చిరంజీవి సన్మానించారు. పాఠాల కంటే.. జీవిత పాఠాలను ఎలా చదవాలో వైఎన్ఎంపీ కాలేజీ(YNMP College) నేర్పించిందని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. సినిమా పరిశ్రమలో నటుడిగా క్రమ శిక్షణతో ఉండడానికి కాలేజీ రోజుల్లో ఎన్ సీసీ(NCC) నేర్పించిన పాఠాలేనని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ సందర్భంగా రాజకీయాలపై మళ్లీ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉండాలంటే.. చాలా మెురటుగా ఉండాలని చెప్పారు. అక్కడ రాటుదేలాలని, కటువుగా ఉండాలని చెప్పారు. ఓ మాట అనాలని, లేదా అనిపించుకోవాలన్నారు. సెన్సిటివ్ గా ఉంటే అక్కడ కుదరదని చెప్పారు. అందుకోసమే తాను రాజకీయాల(Political) నుంచి తప్పుకున్నట్టుగా చెప్పారు.

తాను ఏది చేసినా.. మనసు పెట్టి చేస్తానని, అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకోవడం తన మనసు నుంచి వచ్చింది కాదన్నారు. ఆ రంగంలో మాటలు అనాలన్నా.. అనిపించుకోవాలన్నా.. తన సోదరుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) సమర్థుడని పరోక్షంగా వ్యాఖ్యానించారు. పవన్ కు మీ అందరి అభిమానం, ఆశీస్సులు ఉన్నాయన్నారు. ఏదో ఒకరోజు ఉన్నత స్థాయిలో చూసే అవకాశం ఉందని చెప్పారు.

'ఎన్ సీసీలో చాలా కష్టపడి చేసేవాన్ని. సీనియర్ క్యాడెట్ కెప్టెన్ దాకా అయ్యాను. అందులో మనసు పెట్టి చేశాను. నా మనసులో నుంచి వస్తే అంతు చూడటం నాకు అలవాటు. నా మనసు నుంచి రాకుంటే.. నేను దాని అంతు చూడలేను. నేను అంతు చూడనిది ఏంటో మీకు బాగా తెలుసు. అందుకే అక్కడ నుంచి వెనక్కి వచ్చాను. అక్కడ రాణించడం చాలా కష్టం. సెన్సిటివ్ గా ఉంటే కుదరదు. మెురటుగా ఉండాలి. రాటు దేలాలి. మాటలు అనాలి. అనిపించుకోవాలి కూడా. అవసరమా ఇది అనిపించింది. కానీ తను ఆ రంగంలో తగినవాడు. ఎవరినైనా అంటాడు. అనిపించుకుంటాడు. మీరందరు ఉన్నారు. ఏదో ఒకరోజు అత్యున్నతస్థానంలో చూస్తాం.' అని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chirajeevi) అన్నారు.

యంగ్ గా ఎలా కనిపిస్తున్నావని తన మిత్రుడు అడుగుతున్నారని చిరంజీవి చెప్పారు. తన వృత్తి కోసం ఇలా ఉంటున్నాని మెగాస్టార్ అన్నారు. యంగ్ గా ఉండేందుకు వ్యాయామం చేస్తానని, డైట్ మెయింటేన్ చేస్తానని తెలిపారు. నా ఫ్రెండ్స్ వస్తుంటే.. హేయిర్ కలర్ వేసుకుని రమ్మని చెప్పానని చిరంజీవి ఫన్నీ కామెంట్స్ చేశారు. లేకపోతే.. తనను కూడా మీ వయసు అనుకునే ప్రమాదం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా ఫ్రెండ్స్ అని ఎవరికైనా పరిచయం చేస్తే.. చిరంజీవి ఇంత పెద్దొడా అంటారని వ్యాఖ్యానించారు.

IPL_Entry_Point