ములుగు జిల్లా మేడారంలో నేడు మాఘ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ మహా జాతర ప్రారంభమైంది. ఈ జాతర నాలుగు రోజుల పాటు 19వ తేదీ వరకు జరగనుంది. 18వ తేదీన సీఎం కేసీఆర్ దర్శనానికి వస్తారు. సుమారు కోటిన్నర మంది భక్తులు ఈ జాతరకు వచ్చి.. వనదేవతలను దర్శించుకుంటారు. మెుత్తం నలభై వేల మంది సిబ్బంది.. జాతర కోసం పనిచేస్తున్నారు.