Medak Crime: బెట్టింగ్, జల్సాల కోసం చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన మెదక్ పోలీసులు-medak police arrest two thieves involved in chain snatching for betting and entertainment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Crime: బెట్టింగ్, జల్సాల కోసం చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన మెదక్ పోలీసులు

Medak Crime: బెట్టింగ్, జల్సాల కోసం చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన మెదక్ పోలీసులు

HT Telugu Desk HT Telugu

Medak Crime: బెట్టింగ్, జల్సాలకు అలవాటు పడి, గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మెదక్ పోలీసులు అరెస్ట్ చేసారు. మెదక్ పట్టణానికి చెందిన మొహమ్మద్ అబ్దుల్ ఖాదీర్ (26), మొహమ్మద్ అబ్దుల్ (26) కూలీ పని చేసుకుంటూ వచ్చే సంపాదన చాలక చోరీల బాట పట్టారు.

చైన్‌ స్నాచర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలను చూపుతున్న మెదక్‌ ఎస్పీ

Medak Crime: కూలీ పనులు చేస్తూ వస్తున్న సంపాదన చాలక పోవడంతో చోరీల బాట పట్టిన ఇద్దరిని మెదక్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి చోరీ చేసిన ఆభరణాలు స్వాధీనం  చేసుకున్నారు.  నిందితులు కూలీ పనులతో వచ్చే సంపాదన చాలక పోవడంతో చోరీలు  చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. 

వారి స్నేహితుడు మహమ్మద్ హఫీజ్ నుండి యూనికార్న్ బైక్ నెంబర్ TG 35 2215 తీసుకొని ఇద్దరు హెల్మెట్లను పెట్టుకొని పలు ప్రదేశాలలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు.  గత ఏడాది నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో మెదక్, కామారెడ్డి జిల్లాలో నాలుగు చైన్ స్నాచింగ్ లు చేశారు. మరొక రెండో ప్రయత్నాల్లో విఫలమయ్యారు. అడ్రస్ అడిగే నెపంతో మహిళాల దగ్గరకి వెళ్లి మెడలోని మంగళసూత్రాలు తెంపుకొని పారిపోయేవారు. 

కేసుల వివరాలు…

గత  ఏడాది నవంబర్ 6 రోజు సాయంత్రం  5 గంటల సమయంలో హావేలీఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్తాయికోట గ్రామ శివారులో ఒక TVS XL పై మగ, ఆడ మనిషి వెళ్లుచుండగా, వెనుకల కూర్చున్న ఆడ మనిషిని ముత్తాయికోట కల్లు దుకాణం అడ్రస్ అడుగు నెపంతో ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తల తాడుని లాక్కొని పారిపోయారు. 

గత ఏడాది డిసెంబర్ 21 రోజు సాయంత్రం 5:20 సమయంలో హవేలి ఘనపూర్ మండలం లో జక్కన్నపేట శివారు లో ఒక TVS XL పై మగ, ఆడ మనిషి వెళ్తుంటే, వెనుకల కూర్చున్న ఆడ మనిషిని సుల్తాన్ పూర్ అడ్రస్ అడుగు నెపంతో ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తల తాడుని లాక్కొని పారిపోయినారు. 

జనవరి 4 నాడు సాయంత్రం 5:30 గంటల సమయంలో హవేలి ఘనపూర్ మండలం లోని బూర్గుపల్లి శివారు లో ఒక TVS XL పై మగ, ఆడ మనిషి వెళ్లుచుండగా, వెనుకల కూర్చున్న ఆడ మనిషిని సుల్తాన్ పూర్ అడ్రస్ అడుగుతున్నట్టు నటించి ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తల తాడుని లాక్కొని పారిపోయారు. దొంగిలించిన బంగారాన్ని జనవరి 6 నాడు హైదరాబాద్ లోని వాల్యూ గోల్డ్ లో 1,94,130/- రుపాయలకు అమ్ముకున్నారు. డబ్బులను ఇద్దరు చెరిసగం పంచుకున్నారు.

హవేలీ  ఘన్‌పూర్‌ మండలంలో అరెస్ట్....

బాధితుల నుండి పిర్యాదులు రావటంతో, కేసులు నమోదు చేసుకొని విచారించిన పోలీసులు హవేలీ ఘనపూర్ మండలంలోని ఔరంగాబాద్ శివారులోని తీన్ నెంబర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా వెళ్తున్న యూనికాన్ బైక్ TS 35 2215‌ను ఆపే ప్రయత్నం చేశారు. 

నిందితులు  తప్పించుకొని పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకొని హవేలి ఘనాపూర్ పీఎస్ కు తీసుకొని వచ్చి విచారించారు. దీంతో  వారు చేసిన నేరాలు ఒప్పుకున్నారు. వారివద్ద నుండి ఆరు తులాల రెండు బంగారు మంగళసూత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరొక రెండు మంగళసూత్రాలు సమాచారం కూడా దొరికిందని, వాటిని త్వరలోనే స్వాధీనపరచుకుంటామని మెదక్ ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.