National outh Parliament Utsav : నెహ్రూ యువ కేంద్రం.. జాతీయ యువజన పార్లమెంటు ఉత్సవాల్లో భాగంగా జాతీయ స్థాయి ఉపన్యాస పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలను కొన్ని జిల్లాల వారీగా విభజించింది. అందులో నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, ఉమ్మడి జిల్లాల కేంద్రాలకు కలిపి నెహ్రూ యువ కేంద్రం నిజామాబాద్ ఆన్లైన్ ద్వారా ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈ నెల 20న జరిగే పోటీల్లో గెలిచిన విజేతలు రాష్ట్రస్థాయికి, రాష్ట్రస్థాయిలో గెలిచినవారు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అవుతారు. జాతీయ స్థాయిలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రెండు లక్షల నగదు, రెండో బహుమతి రూ.1,50,000 ,మూడో బహుమతి రూ.లక్ష , ప్రోత్సాహక బహుమతులు ఇద్దరికి 50 వేల చొప్పున ఇస్తారు.
1. ఫిబ్రవరి 01, 2024 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
2. మై భారత్ అనే కేంద్ర ప్రభుత్వ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే అర్హులు
జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి పోటీలలో అభ్యర్థులు తెలుగు హిందీ లేదా ఇంగ్లీషులో మాట్లాడవచ్చు. రాష్ట్రస్థాయి పోటీలలో గెలుపొందిన అభ్యర్థులకు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడాలి. న్యాయ నిర్ణేతల నిర్ణయమే తుది నిర్ణయం. న్యాయ నిర్ణేతలు సూచించిన నిడివిలోనే మాట్లాడాలి. అలాగే పైన సూచించిన అంశాలకు సంబంధించిన ఉపన్యాసం మాత్రమే ఇవ్వాలి. పోటీలలో పాల్గొనదలచిన జిల్లాల అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు www.mybharat.gov.in ద్వారా వారి జిల్లాకు సంబంధించిన పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ పోటీలు ఈ నెల 20న ఉదయం 11 గంటలకు ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు. ఇతర వివరాలకు ఉమ్మడి మెదక్ జిల్లా కార్యక్రమ అధికారి జి.కిరణ్ కుమార్ 9963056730 ఆఫీసు సమయాల్లో సంప్రదించవచ్చని ఉమ్మడి జిల్లా యువజన అధికారి మూల రంజిత్ రెడ్డి తెలిపారు.
హెచ్.టి.తెలుగు రిపోర్టర్, మెదక్
సంబంధిత కథనం