Medak News : సెలవు పెట్టకుండానే విధులకు వైద్య సిబ్బంది గైరాజరు, కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరిక-medak news in telugu collector rajarshi shah searched govt hospital identity doctors staff not attending ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Medak News In Telugu Collector Rajarshi Shah Searched Govt Hospital Identity Doctors Staff Not Attending

Medak News : సెలవు పెట్టకుండానే విధులకు వైద్య సిబ్బంది గైరాజరు, కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరిక

HT Telugu Desk HT Telugu
Feb 22, 2024 10:58 PM IST

Medak News : మెదక్ జిల్లా కౌడిపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్వాకం బయపడింది. వైద్యులు, సిబ్బంది ముందస్తు సెలవు పెట్టుకుండానే డ్యూటీలకు డుమ్మా కొడుకున్నారు. లీవ్ రాసి దానిపై డేట్ వేయకుండా అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. కలెక్టర్ తనిఖీలో ఈ విషయం బయపడింది.

మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్ కలెక్టర్ రాజర్షి షా

Medak News : ముందస్తుగా సెలవు పెట్టకుండానే, గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, మిగతా స్టాఫ్ విధులకు గైరాజరు అవుతున్న విషయం మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గైరాజరు అవుతున్న సిబ్బంది, కొంతమంది తమ లీవ్ లెటర్ ని రాసి, హాజరు రిజిస్టర్ లో తమ లీవ్ లెటర్ పెట్టారు. కానీ కావాలనే ఆ లీవ్ లెటర్ లో డేట్ వేయలేదు. ఒక వేల ఆ లీవ్ లెటర్ ను ఎవరు చూడకపోతే, మరుసటి రోజు వచ్చి తాము విధులకు హాజరు అయినట్టు సంతకం పెట్టుకుంటున్నారు. కౌడిపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసున్నా ప్రభుత్వ ఉద్యోగుల లీలలు, మెదక్ కలెక్టర్ రాజర్షి షా బుధవారం రోజు చేసిన ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

లీవ్ లెటర్ పైన డేట్ వేయకుండానే

ఆసుపత్రిలో చాలా మంది డాక్టర్లు, నర్సులు, మిగతా సిబ్బంది లీవ్ పెట్టకుండానే విధులకు గైరాజరు అవుతున్నట్టు తనిఖీలో కలెక్టర్ కు తెలిసింది. విధులకు గైరాజరు అవుతున్న ఉద్యోగులు, తమ పై అధికారులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం లీవ్ లెటర్ అటెండన్స్ రిజిస్టర్ లో పెట్టకుండానే లీవ్ లో వెళ్లినట్టు కలెక్టర్ తేల్చారు. ఆసుపత్రి నుంచి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ తో ఫోన్ లో మాట్లాడుతూ, వారందరు లీవ్ పెట్టకుండా ఎలా గైరాజరు అయ్యారో రాతపూర్వకంగా సంజాయిషీ కోరాలని కలెక్టర్ ఆదేశించారు. వారు ఇచ్చిన రాతపూర్వక సంజాయిషీ సమంజషంగా అనిపించకపోతే, తప్పకుండా కఠిన చర్యలు చేపడతామని కలెక్టర్ ఉద్యోగులను హెచ్చరించారు. మెదక్ నుంచి హైదరాబాద్ హైవే పక్కనే ఉన్న ఆసుపత్రిలో, ఇలా లీవ్ పెట్టకుండా ఉద్యోగులు విధులకు గైరాజరు అవ్వటం అందరిని విస్మయానికి గురిచేసింది.

ముందస్తు సమాచారంతో ఆకస్మిక తనిఖీ

వైద్య సిబ్బంది గైరాజరుపై స్థానికులు కొంతమంది, కలెక్టర్ సమాచారం ఇవ్వటమే వల్లే కలెక్టర్ ఆసుపత్రిలో ఈ ఆకస్మిక తనిఖీ చేసినట్టు తెలుస్తుంది. కౌడిపల్లి మండలం పూర్తిగా వెనకపడిన ప్రాంతం కావడం, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగుల గైరాజరు వలన, ఆసుపత్రికి వచ్చే పేద పేషెంట్లు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్టు స్థానికులు చెపుతున్నారు. చాలా మంది తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నట్టు తెలుస్తుంది.

పేషెంట్లతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్న కలెక్టర్

తనిఖీలో భాగంగా, కలెక్టర్ ఆసుపత్రిలో మందులు సరిగా పంపిన చేస్తున్నారా? లేదా? అని చెక్ చేశారు. పేషెంట్లతో మాట్లాడి, వారికున్న ఇబ్బందులను కలెక్టర్ తెలుసుకున్నారు. డాక్టర్లు, నర్సులు ఆసుపత్రికి వచ్చిన వారితో ఎలా ప్రవర్తిస్తున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వారికి ఎటువంటి ఇబ్బంది కలిగిన తన ఆఫీస్ కి వచ్చి ఫిర్యాదు చేయాలని పేషెంట్లకు కలెక్టర్ సూచించారు. కౌడిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువ ఉందని, ఉద్యోగులు ఎవరూ గైరాజరు అయినా తాను ఉపేక్షించనని రాజర్షి షా వార్నింగ్ ఇచ్చారు .

WhatsApp channel