Medak Medical Collage Jobs : మెదక్ వైద్య కళాశాలలో 24 పోస్టుల భర్తీ, ఈ నెల 27న వాక్-ఇన్ ఇంటర్య్వూ-medak govt medical college senior resident tutor posts recruitment on april 27th interview ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Medical Collage Jobs : మెదక్ వైద్య కళాశాలలో 24 పోస్టుల భర్తీ, ఈ నెల 27న వాక్-ఇన్ ఇంటర్య్వూ

Medak Medical Collage Jobs : మెదక్ వైద్య కళాశాలలో 24 పోస్టుల భర్తీ, ఈ నెల 27న వాక్-ఇన్ ఇంటర్య్వూ

HT Telugu Desk HT Telugu

Medak Medical Collage Jobs : మెదక్ ప్రభుత్వ వైద్య కాలేజీలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ అయ్యింది. 21 సీనియర్ రెసిడెంట్, 3 ట్యూటర్ పోస్టులకు ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు.

మెదక్ వైద్య కళాశాలలో 24 పోస్టుల భర్తీ

Medak Medical Collage Jobs : 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభం కానున్న మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాల(Medak Medical College Jobs)లో గౌరవ వేతన పద్ధతిపై 21 సీనియర్ రెసిడెంట్, 3 ట్యూటర్ పోస్టులకు వాక్-ఇన్-ఇంటర్వ్యూలకు(Walk in Interview) ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, కళాశాల ప్రిన్సిపల్ ఎస్. రవీంద్ర కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్ రెసిడెంట్ పోస్ట్(Senior Resident) కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎండీ /ఎoఎస్/ డీఎన్బీ, ఎన్ఎంసీటీఈక్యూ రెగ్యులేషన్ 2022 ప్రకారం ఎంబీబీఎస్ అడిషనల్ క్వాలిఫికేషన్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని ఉండాలన్నారు. ట్యూటర్ సీనియర్ రెసిడెంట్ పోస్టులకు మార్చి 31, 2024 నాటికి 45 ఏళ్లు లోపు ఉండాలన్నారు. ట్యూటర్ ఎంబీబీఎస్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. నెలవారీ వేతనం రూ.92,575 గా ఉంటుందన్నారు.

ఈ నెల 27న మెదక్ లో ఇంటర్వ్యూలు

ఇతర రాష్ట్రాల అభ్యర్థుల తమ నియామకాన్ని ధ్రువీకరించడానికి ఎంపికైన వారం రోజుల్లోగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్(Telangana State Medical Council) నుంచి తమ అర్హతను నమోదు చేసుకోవాలని చెప్పారు. సీనియర్ రెసిడెంట్(Senior Resident) నెలవారీ వేతనం రూ.92,575 గా ఉంటుందని, ట్యూటర్(Tutor Resident) వేతనం 55,000 చెల్లిస్తారన్నారు. స్థానికేతర అభ్యర్థుల కంటే స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఒరిజినల్ అకాడమిక్ సర్టిఫికెట్లు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు రెండు, అకాడమిక్ సర్టిఫికెట్ల ఫొటో కాపీలతో ఈనెల 27న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 04 గంటల వరకు మెదక్ జిల్లా ప్రభుత్వాస్పత్రి(Medak Govt Hospital)లోని పర్యవేక్షక ఛాంబర్ లో ఇంటర్వ్యూలకు(Interview) హాజరుకావాలని తెలిపారు.

రైల్వేలో ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త ఇచ్చింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(Railway Jobs)! రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్​లో 452 సబ్​ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల ఖాళీలకు ఆర్పీఎఫ్ 01/2024, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్​లో 4,208 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఖాళీలకు ఆర్పీఎఫ్ 02/2024 నోటిఫికేషన్లను.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్​ఆర్​బీ) విడుదల చేసింది. ఆర్​ఆర్​బీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఐ రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు ప్రక్రియ సంబంధిత ఆర్​ఆర్​బీకి చెందిన అధికారిక వెబ్​సైట్​ లో ఏప్రిల్ 15న ప్రారంభమయ్యింది. ఆర్పీఎఫ్ ఎస్ఐ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మే 14 వరకు గడువు ఉంది. దరఖాస్తు ఫారం కరెక్షన్ విండో 2024 మే 15 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటుంది.