Medak accident: మెదక్ జిల్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్ బాలురు మృతి
మెదక్: మైనర్లకు బైకులు ఇవ్వటం ఎంత ప్రమాదమో మరొకసారి ఋజవు అయ్యింది. మెదక్ జిల్లాలో బైక్ మీద వెళ్తున్న ముగ్గురు మైనర్ బాలురను, ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొక బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
మెదక్ జిల్లాలో బైక్ మీద వెళ్తున్న ముగ్గురు మైనర్ బాలురను ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొక బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామం వద్ద జాతీయ రహదారి-161 లో భాగంగా నిర్మించిన అండర్ పాస్ వద్ద జరిగింది.
మృతులు సీతానగరం గ్రామానికి చెందిన చిన్నోళ్ల సాయి (13), లింగాల విజయ్ (16) గా గుర్తించారు. ఆ బాలుర మరణం, వారి తల్లులకు కడుపుకోత మిగిల్సింది. గాయపడ్డ మరొక బాలున్ని, జోగిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స తర్వాత హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది.
కన్న తల్లులకు కడుపుకోత.…
ప్రమాద విషయం తెలిసిన సీతానగరం ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ వద్దకు చేరుకున్నారు. మృతుల తల్లి తండ్రుల రోదనలు చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరయ్యారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఇదే దారిలో వెళుతున్న అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ విషయం తెలిసి బాధితులను పరమార్శించారు. ప్రభుత్వం తరపున, తప్పకుండ బాధితులను ఆదుకుంటామని అయన హామీ ఇచ్చారు. క్రాంతి కిరణ్ తో పాటు బాధిత కుటుంబాలను ఓదార్చిన వారిలో ట్రేడ్ కార్పొరేషన్బి మఠం బిక్షపతి, బిఆరెస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, ఇతర నాయకులూ ఉన్నారు.
మరొక ప్రమాదంలో ఒకరి మృతి..
వడ్లు రోడ్ మీద ఆరబెట్టడం, లోడ్ చేసిన ట్రాక్టర్లు కూడా ఎటువంటి ఇండికేటర్లు లేకుండా రోడ్ పక్కన ఆపటం ఎంత ప్రమాదమో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా సంఘటనల వాళ్ళ తెలుస్తూనే ఉన్నదీ. అయినా, ప్రజలు తమ తీరు మార్చుకోవటం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మంగళవారం తెల్లవారు జామున మెదక్ జిల్లాలోని రామాయంపేట దగ్గర వడ్ల లోడుతో ఉన్న ఆ ట్రాక్టర్ ని అపి ఉంచటం ఈ ప్రమాదానికి కారణమయింది. అదే దారిలో వెళ్తున్న బొలెరో వాహనం ట్రాక్టర్ని ఢీకొట్టడంతో బొలెరో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతిడు రాహుల్ శ్యాం (20) గా గుర్తించారు. బొలెరో వెనకనే వస్తున్నాఆర్టీసీ బస్సు కూడా బోలెరోని గుద్దటంతో బస్సు లో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డవారిని రామాయంపేట ఆసుపత్రికి తరలించారు.