Medak Crime : మెదక్ జిల్లాలో విషాదం, సెల్ ఫోన్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య-medak crime news in telugu degree student committed suicide parents not buy cell phone ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Crime : మెదక్ జిల్లాలో విషాదం, సెల్ ఫోన్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Medak Crime : మెదక్ జిల్లాలో విషాదం, సెల్ ఫోన్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu
Jul 23, 2024 09:51 PM IST

Medak Crime : ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మెదక్ జిల్లాల్లో తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మెదక్ జిల్లాలో విషాదం, సెల్ ఫోన్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
మెదక్ జిల్లాలో విషాదం, సెల్ ఫోన్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Medak Crime : తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం రుక్మాపూర్ గ్రామానికి చెందిన రుచిత (19) మెదక్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమె ప్రతిరోజు ఇంటి నుంచి కాలేజీకి వెళ్లి వస్తుంది. ఈ క్రమంలో రోజు మెదక్ వెళ్లి రావడం తీవ్ర ఇబ్బందిగా ఉందని అక్కడే హాస్టల్ లో ఉండి చదువుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో సోమవారం తాను హాస్టల్ లో ఉండి చదువుకుంటానని, దానికోసం ఒక సెల్ ఫోన్ కొనివ్వమని తల్లిదండ్రులను అడిగింది. కాగా వారు ఇప్పుడు డబ్బులకు ఇబ్బందిగా ఉందని, కొన్ని రోజుల తర్వాత కొనిస్తామని రుచితకు నచ్చజెప్పారు. ఆ తర్వాత వారు పొలం పనులకు వెళ్లారు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైనా రుచిత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ చదువుతున్న కుమార్తె అర్ధాంతరంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు.

yearly horoscope entry point

మద్యానికి డబ్బులివ్వలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

మద్యానికి బానిసైన ఓ యువకుడు మద్యం తాగడానికి నాయనమ్మ డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ లో సోమవారం చోటుచేసుకుంది. హవేలీ ఘనపూర్ గ్రామానికి చెందిన మంగ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం మరణించాడు. దీంతో మంగ బతుకు దెరువు కోసం హైదరాబాద్ లో నివసిస్తుంది. కాగా కుమారుడు నాగరాజు (20) సొంతూర్లోనే నాయనమ్మ లక్ష్మి వద్ద ఉంటున్నాడు. దీంతో నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో సోమవారం మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వమని నాయనమ్మను అడగడంతో, ఆమె డబ్బులు లేవని చెప్పింది. దీంతో నాగరాజు మనస్థాపానికి గురయ్యాడు. ఆమె పొలం పనికి వెళ్లిన తర్వాత ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా పొలం పనుల నుంచి ఇంటికి వచ్చిన నాయనమ్మ తలుపు తీసేసరికి నాగరాజు దూలానికి వేలాడుతూ కనిపించాడు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలో భర్త,ఇప్పుడు కొడుకు మరణించడంతో తల్లి భోరున విలపిస్తోంది. మృతుడి తల్లి మంగ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు రూ. 5 వేల ఆర్ధిక సాయాన్ని నాయకుల ద్వారా అందించారు.

Whats_app_banner

సంబంధిత కథనం