Medak Crime : మెదక్ లో దారుణం, వివాహేతర సంబంధం కొనసాగించడంలేదని ప్రాణం తీశాడు
Medak Crime : వివాహేతర సంబంధం మహిళ ప్రాణాలు తీసింది. మెదక్ ఫతేనగర్ కు చెందిన ఓ మహిళతో కొంత కాలంగా ఓ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తన కుమారులకు తెలిసిపోయిందని మహిళ అతడిని దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకుని ఆమెను హత్య చేశాడు ప్రియుడు.

Medak Crime : అక్రమ సంబంధం మరొక ప్రాణం తీసుకుంది. అక్రమ సంబంధాల వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్న, ఇలాంటి సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. అప్పటి వరకు సంబంధం కొనసాగించిన మహిళా తనను దూరం పెడుతుందన్న కోపంతో, ఒక వ్యక్తి తన ప్రియురాలని చంపి, శవాన్ని తగలబెట్టిన సంచలన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే మెదక్ పట్టణంలో ఫతేనగర్ లో నివాసం ఉంటున్న ఓ మహిళ ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఆమె భర్త చనిపోవడంతో, తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తుంది. తమ ఇంటికి దగ్గరలో ఉన్న బత్తుల ఏసు(40) మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని సంవత్సరాలు ఆ సంబంధం కొనసాగింది.
మహిళ కొడుకులకు విషయం తెలియడంతో
అయితే ఈ విషయం, కొడుకులకు తెలియటంతో మహిళను తీవ్రంగా హెచ్చరించారు. తన కొడుకులకు భయపడి, గత కొంత కాలంగా ఏసును దూరం పెడుతూ వచ్చింది. మహిళ తనను దూరం పెడుతూ రావటంతో, ఆమెపై తీవ్ర కక్ష పెట్టుకున్న ఏసు ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. కలిసి మద్యం తాగుదామనే నెపంతో, మహిళను చిన్న శంకరంపేట్ మండలంలోని కొండాపూర్ గ్రామం దగ్గర్లోని అటవీ ప్రాంతానికి ఈ నెల 8న తీసుకెళ్లాడు. మద్యం తాగిన తర్వాత తనతో అదే విషయంపైన తీవ్ర వాగ్వివాదానికి దిగాడు. ముందుగానే తనతో తెచ్చుకున్న కత్తితో మహిళను పొడిచి చంపాడు. చంపినా తర్వాత, మృతదేహన్ని పెట్రోల్ పోసి నిప్పటించాడు.
మొదట మిస్సింగ్ కేసు నమోదు
తమ తల్లి కనిపించక పోవటం, ఫోన్ కూడా లేపకపోవటంతో ఆమె కుమారులు మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు..మహిళకు ఏసుతో ఉన్న సంబంధం గురించి తెలిసింది. ఆ దిశగా విచారణ చేశారు. మొదట ఏసు నేరం ఒప్పుకోకపోవడంతో, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం చెప్పాడు. పోలీసులను నేరస్థలం దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ పోలీసులకు కొన్ని ఎముకలు తప్ప ఏమి దొరకలేదు. తదుపరి విచారణ కోసం.. పోలీసులు ఎముకలను ల్యాబ్ కి పంపించారు. ఈ సంఘటన మెదక్ పట్టణంలో సంచలనం సృష్టించింది. పోలీసులు ఏసుని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.
సంబంధిత కథనం