తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు - ఈ జిల్లాలకు కొత్త కలెక్టర్లు-massive ias transfers in telangana full list here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు - ఈ జిల్లాలకు కొత్త కలెక్టర్లు

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు - ఈ జిల్లాలకు కొత్త కలెక్టర్లు

తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు జరిగాయి. మొత్తం 33 మంది ఐఏఎస్ లకు స్థానచలనం కల్పించారు. అంతేకాకుండా మరో ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్ ను బదిలీ చేసింది. ఆయనకు… ఇందన శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అప్పగించింది. ఈ స్థానంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న లోకేశ్‌ కుమార్‌ ను రెవెన్యూ కార్యదర్శిగా నియమించింది. అంతేకాకుండా సీసీఎల్‌ఏ బాధ్యతలను కూడా అప్పగించింది. ఈ బదిలీల్లో భాగంగా… పలు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం మార్చింది.

బదిలీల వివరాలు:

  • హైదరాబాద్‌ కలెక్టర్‌గా హరిచందన దాసరి
  • ఖమ్మం జిల్లా కలెక్టర్ గా అనుదీప్.
  • హన్మకొండ కలెక్టర్‌గా స్నేహ శబరీష్.
  • నిజామాబాద్ కలెక్టర్‌గా వినయ్ కృష్ణా రెడ్డి.
  • తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా జే శంకరయ్య.
  • ఆర్ అండ్ ఆర్ కమిషనర్‌గా శివకుమార్ నాయుడు.
  • రిజిస్ట్రేషన్స్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆర్ హనుమంతు నియమాకం.
  • సమాచార కమిషన్ సెక్రటరీగా లక్‌పతి నాయక్.
  • పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా నవీన్‌ నికోలస్‌.
  • టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా వల్లూరి క్రాంతి.
  • హ్యూమన్‌ రైట్స్‌ కమిషనర్‌ సెక్రటరీగా నిర్మల క్రాంతి వెస్లీ.
  • ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌గా నిఖిల్‌ చక్రవర్తి.
  • సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మి.
  • స్త్రీ,శిశు సంక్షేమ డైరెక్టర్‌గా శ్రీజన.
  • ఆరోగ్యశ్రీ సీఈవోగా ఉదయ్‌ కుమార్‌.
  • ఐ అండ్‌ పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌గా చెక్క ప్రియాంక బదిలీ
  • తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా ప్రియాంకా ఆల.
  • వ్యవసాయ సహకారశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎల్‌ శివశంకర్‌ (విపత్తు నిర్వహణ అదనపు బాధ్యతలు).
  • గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా వీపీ గౌతమ్‌ (అదనపు బాధ్యతలు), సింగరేణి డైరెక్టర్‌గా పీ గౌతమ్‌.
  • మత్స్యశాఖ డైరెక్టర్‌గా నిఖిల.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.