జనగామ జిల్లా కేంద్రంలోని ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. తొలుత ఓ షాపులో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే పక్కన ఉన్న మరో రెండు దుకాణాలకు కూడా వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో దుకాణాలు బూడిదయ్యాయి.
జనగామ టౌన్ లో ఉన్న ఉన్న విజయ దుకాణంలో మంటలు రాగా… పక్కన ఉన్న శ్రీలక్ష్మీ వస్త్ర దుకాణంలోకి కూడా వ్యాపించాయి. తెల్లవారుజామున విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే ఫైరింజిన్‌లు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. ఈ ప్రమాదంలో 8 నుంచి పది కోట్లకు పైగా పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టడంతో చుట్టుపక్కల షాప్ ల వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదం జరగటంతో కొన్ని షాపులు వెంటనే మూసివేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.