Khammam : ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆహుతైన పత్తి బస్తాలు-massive fire accident at khammam cotton market ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam : ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆహుతైన పత్తి బస్తాలు

Khammam : ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆహుతైన పత్తి బస్తాలు

Khammam Cotton Market : ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మార్కెట్‌ యార్డ్ షెడ్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల దాటికి 400కు పైగా పత్తి బస్తాలు దహనమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది… మంటలార్పుతుంది.

పత్తి మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. మంటల్లో 400కి పైగా బస్తాలు దహనమైనట్లు తెలిసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

కాలిపోయిన పత్తి విలువ లక్షల్లో ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇందులో ఒకే రైతుకు చెందిన 200 బస్తాలు ఉన్నట్లు సమాచారం. భారీగా మంట‌లు ఎగిసిప‌డ‌డంతో మంట‌ల‌ను ఆర్పేందుకు తీవ్రంగా శ్ర‌మించారు. ద‌ట్ట‌మైన పొగ‌లు కమ్ముకోవ‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ ఘటనకుసంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం పత్తి బస్తాలు మాత్రమే ఆహుతయ్యాయి. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు… ఘటనపై ఆరా తీసినట్లు తెలిసింది.