RFCL Job Notification: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం-management trainee jobs in ramagundam fertilizers applications open ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rfcl Job Notification: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం

RFCL Job Notification: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం

Sarath chandra.B HT Telugu
Feb 16, 2024 07:00 AM IST

RFCL Job Notification: రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు
రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు

RFCL Job Notification: రామగుండం ఫెర్టిలైజన్స్‌ అండ్ కెమికల్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్‌ఎఫ్‌ఎల్‌, ఈఐఎల్‌, ఎఫ్‌సిఐఎల్‌ జాయింట్ వెంచర్‌ సంస్థ అయిన రామగుండంఫెర్టిలైజర్స్‌ కంపెనీలో మేజేన్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

నేషనల్ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌, ఫెర్టిలైజర్స్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్‌ వెంచర్‌గా రామగుండంలో నిర్వహిస్తున్న ఫెర్టిలైజర్స్‌ కంపెనీలో రోజుకు 2200 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఆధారిత అమ్మోనియా, 3850 మెట్రిక్ టన్నుల నీమ్ కోటెడ్ యూరియా ఉత్పత్తి చేస్తారు.

తాజా నోటిఫికేషన్‌లో మొత్తం 7రకాల ఉద్యాగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో కెమికల్ విభాగంలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 10, మెకానికల్ మేనేజ్‌మెంట్ ట్రైనీలో పోస్టులు 6, ఎలక్ట్రికల్ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 3, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు 3, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనీ పోస్టులు 2, లా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 1, హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 3 ఉన్నాయి. మొత్తం 28 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆర్‌ఎఫ్‌సిఎల్‌ వెబ్‌ సైట్ https://www.rfcl.co.in కెరీర్స్‌ విభాగంలో పూర్తి వివరాలను చూడవచ్చు. ఫిబ్రవరి 14 నుంచి నోటిఫికేషన్ అందుబాటులోకి రానుంది. మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆర్‌ఎఫ్‌సిఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. నోటిఫికేషన్ సవరణ, అనుబంధ నోటిఫికేషన్, మార్పుల గురించి వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని ఆర్‌ఎఫ్‌సిఎల్ పేర్కొంది.

నాన్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ...

ఆర్‌ఎఫ్‌సిఎల్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 10వ తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో ప్రొడక్షన్ విభాగంలో జూనియర్‌ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, మెకానికల్ విభాగంలో అసిస్టెంట్ గ్రేడ్2,ఎలక్ట్రికల్,ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ లాబ్, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అన్ని విభాగాల్లో కలిపి 35 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. రిజర్వేషన్ల వారీగా పోస్టుల వివరాలు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.