Man sets ablaze his bike : తాళం లాక్కున్నారని బండి తగులబెట్టిన ఓనర్-man poured petrol and sets ablaze his bike after police stop for wrong side driving ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Man Poured Petrol And Sets Ablaze His Bike After Police Stop For Wrong Side Driving

Man sets ablaze his bike : తాళం లాక్కున్నారని బండి తగులబెట్టిన ఓనర్

HT Telugu Desk HT Telugu
Oct 04, 2022 11:51 AM IST

Man sets ablaze his bike రాంగ్‌ రూట్‌లో వస్తున్న టూ వీలర్ తాళాన్ని ట్రాఫిక్ హెంగార్డు లాక్కోవడంతో చిర్రెత్తిన యజమాని బండిపై పెట్రోల్ పోసి తగులబెట్టేశాడు. నడిరోడ్డుపై వాహనానికి నిప్పంటించేశాడు. హైదరాబాద్‌ అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద జరిగిన ఘటనలో వాహనం కాలి బూడిదైంది.

మంటల్లో కాలిపోతున్న ద్విచక్ర వాహనం
మంటల్లో కాలిపోతున్న ద్విచక్ర వాహనం

Man sets ablaze his bike ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడంతో హోంగార్డు అడ్డుకోవడం, వాహన చోదకుడిని చిర్రెత్తించింది. తన దుకాణం ఎదురుగానే ఉన్నా వెళ్లకుండా బండి తాళం లాక్కోవడంతో ఉక్రోషంతో వాహనంపై పెట్రోల్ పోసి తగులబెట్టేశాడు. హైదరాబాద్‌ అమీర్‌పేట చౌరస్థాలో ఈ ఘటన జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

రాంగ్‌రూట్లో వస్తున్నావంటూ ట్రాఫిక్‌ పోలీసు ఆపి, వాహనం తాళం లాక్కున్నందుకు వాహన దారుడు తన బైక్‌పై పెట్రోలు చల్లి నిప్పంటించాడు. హైదరాబాద్‌ ఎస్సార్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎల్లారెడ్డి గూడకు చెందిన అశోక్‌ అమీర్‌ పేట మైత్రీ వనంలోని అన్నపూర్ణ బ్లాక్‌లో మొబైల్స్‌ దుకాణాన్ని నడుపుతున్నాడు. సోమవారం సాయంత్రం అమీర్‌ పేట మెట్రోస్టేషన్‌ కింద యూటర్న్‌ తీసుకుని ఎదురుగా ఉన్న అన్నపూర్ణ బ్లాక్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న హోంగార్డు అస్గర్‌ అశోక్‌ను అడ్డుకున్నాడు.

రాంగ్‌ రూట్లో ఎందుకొస్తున్నావని ప్రశ్నించాడు. తన దుకాణం ఎదురుగానే ఉందని చెప్పినా వినిపించుకోకుండా బండి తాళం లాక్కోవడం అశోక్‌ అక్రోశానికి కారణమైంది. తన దుకాణంలోకి వెళ్లి సీసాలో పెట్రోలు తీసుకొచ్చి బైక్‌పై చల్లి నిప్పుపెట్టాడు. నడిరోడ్డుపై వాహనం కాలి బూడిదైంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది.

తాను రోడ్డుకు అవతలి వైపు నుంచి యూటర్న్‌ తీసుకుని తన దుకాణంలోకి వెళుతుంటే వాహనాన్ని ఆపారని, అదే మార్గంలో వచ్చిన ఖరీదైన కారు రాంగ్‌ రూట్లో వెళుతున్నా పట్టించుకోలేదని వాహన చోదకుడు ఆరోపించారు. ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేసిన అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్సార్‌నగర్‌ స్టేషన్‌కు తరలించారు. అశోక్‌ రాంగ్‌ రూట్లో వస్తుండటంతో ఇతర వాహన దారులకు ప్రమాదమని గుర్తించి హోం గార్డు ఆపారని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం జాయింట్ కమిషనర్‌ చెప్పారు. రోడ్డుపై పెట్రోల్‌ పోసి వాహనాన్ని దగ్ధం చేసినందుకు నిందితుడిపై కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు.

ద్విచక్ర వాహనం కాలిపోతుండటంతో ఆ మార్గంలో ప్రయాణించే వారు ఆందోళనకు గురయ్యారు. మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించిన వారితో వాహన చోదకుడు వాగ్వాదానికి దిగారు. తన బండి తాను తగులబెట్టుకుంటానని దబాయించాడు. నడిరోడ్డుపై ప్రమాదకరంగా వాహనాన్ని దగ్ధం చేయడం, ఇతరులకు ప్రమాదం వాటిల్లేలా వ్యవహరించడంతో అశోక్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

IPL_Entry_Point