Hyd Fire Accident: హైదరాబాద్‌ షేక్‌పేట జుహి ఫెర్టిలిటీ సెంటర్‌‌లో భారీ అగ్నిప్రమాదం-major fire at juhi fertility center in sheikhpet hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Fire Accident: హైదరాబాద్‌ షేక్‌పేట జుహి ఫెర్టిలిటీ సెంటర్‌‌లో భారీ అగ్నిప్రమాదం

Hyd Fire Accident: హైదరాబాద్‌ షేక్‌పేట జుహి ఫెర్టిలిటీ సెంటర్‌‌లో భారీ అగ్నిప్రమాదం

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 17, 2025 08:24 AM IST

Hyd Fire Accident: హైదరాబాద్‌ షేక్‌పేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షేక్‌పేట ప్రధాన మార్గంలో ఉన్న భారీ కాంప్లెక్స్‌ రెండో అంతస్తులో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఇవి మూడో అంతస్తుకు కూడా వ్యాపించడంతో భవనం అగ్ని కీలల్లో చిక్కుకుంది.

హైదరాబాద్ ఫెర్టిలిటీ సెంటర్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ ఫెర్టిలిటీ సెంటర్‌లో అగ్నిప్రమాదం

Hyd Fire Accident: హైదరాబాద్‌ షేక్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షేక్‌పేట మెయిన్‌ రోడ్డులో ఉన్న కాంప్లెక్స్‌ మొదటి అంతస్తులో ఉన్న జుహి ఫెర్టిలిటీ సెంటర్‌లో తెల్లవారు జామున ఐదున్నరకు అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌తో దట్టమైన పొగలు వ్యాపించడంతో సెక్యూరిటీ సిబ్బంది ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. భవనం కింద భాగంలో రిలయన్స్ ట్రెండ్స్‌ షోరూమ్ నిర్వహిస్తుండగా దానిని అనుకున్న భవనంలో డీ మార్ట్‌ ఉన్నాయి. భవనం రెండు మూడు అంతస్తులు కాలి బూడిదగా మారాయి. అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. భవనం వెనుక భాగంలో హాస్టళ్లు ఉండటంతో దట్టమైన పొగలతో వారు ఉక్కిరి బిక్కిరయ్యారు. పోలీసులు హాస్టళ్లను ఖాళీ చేయించారు. భవనంలో దట్టమైన పొగలు వ్యాపించి ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

Whats_app_banner