Polytechnic College Incident : తెలంగాణలో మరో షాకింగ్ ఘటన, కాలేజీ వాష్ రూమ్ లో వీడియో రికార్డింగ్!
Polytechnic College Incident : తెలంగాణలో మరో షాకింగ్ ఘటన జరిగింది. పాలిటెక్నిక్ కాలేజీలో బాలికల వాష్ రూమ్ లో మొబైల్ తో వీడియో రికార్డింగ్ చేసినట్లు విద్యార్థినులు గుర్తించారు. దీంతో విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగాయి.
Polytechnic College Incident : తెలంగాణలో...కాలేజీ వాష్ రూమ్ లో వీడియో రికార్డింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని సీఎంఆర్ కాలేజీలో ఈ తరహా ఘటన జరిగిందని విద్యార్థినులు ఆందోళన చేయగా..తాజాగా మహబూబ్ నగర్ లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రైవేట్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. బాలికల వాష్ రూమ్ లో సెల్ ఫోన్ తో వీడియో రికార్డింగ్ చేస్తున్నట్లు విద్యార్థినులు గుర్తించారు. సిద్ధార్థ్ అనే విద్యార్థి మొబైల్ పెట్టునట్లు గుర్తించారు. బ్యాక్ లాగ్ పరీక్ష రాసేందుకు వచ్చి వాష్ రూమ్ లో ఫోన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
సీఎంఆర్ కాలేజీ ఘటన
మేడ్చల్ జిల్లాలోని సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ బాలికల హాస్టల్‌లో.. వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు సంచలనంగా మారాయి. ఈ ఘటనను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఛైర్‌పర్సన్ శారద సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ ఘటనపై వేగంగా దర్యాప్తు చేయాలని కోరారు. వీలైనంత త్వరగా కమిషన్‌కు నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.
గత మూడు నెలల్లో దాదాపు 300 ప్రైవేట్ వీడియోలు రహస్యంగా రికార్డ్ చేశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలను అమర్చినందుకు బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ సభ్యులతో కలిసి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఇష్యూలో హాస్టల్ సిబ్బంది ప్రమేయం ఉండవచ్చని విద్యార్థినులు అనుమానిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం ఈ విషయాన్ని తొక్కేయడానికి ప్రయత్నించిందని, బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని విద్యార్థినులను హెచ్చరించిందనే ఆరోపణలు ఉన్నాయి.
విద్యార్ధినుల వాష్ రూమ్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లోకి వస్తే.. మల్లారెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని విద్యార్థులు హెచ్చరించారు. విద్యార్థుల నిరసన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. హాస్టల్‌లో పనిచేస్తున్న, భవనం సమీపంలో ఉంటున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు సిబ్బందిని మోహరించారు.
సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ పరిసరాలను పరిశీలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం క్లియర్‌గా కనపడుతోందన్నారు. ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ లభించాయని, మెస్‌లో పనిచేసే వ్యక్తులు మాత్రమే లోపలికి వచ్చే అవకాశం ఉందన్నారు. 5 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారికి చెందిన 12 సెల్ ఫోన్లను సీజ్ చేశామన్నారు. టెక్నికల్ టీం ఫోన్లని అనేక విధాలుగా పరిశీలించారన్నారు. వాటిలో ఎలాంటి వీడియోలు, ఫోటోలు లభించలేదని పోలీసులు వివరించారు.
సంబంధిత కథనం