SC Categorization : ఢిల్లీలో మహాధర్నా... SC వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలన్న మందకృష్ణ
Madiga Reservation Porata Samithi:ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే SC వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు మందకృష్ణ మాదిగ. ఢిల్లీలో తలపెట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు.

Madiga Reservation Porata Samithi: ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లోనే SC రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించాలని డిమాండు చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా చేపట్టారు. మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు మాదిగ ఉద్యోగుల సంఘం (MEF), మాదిగ జర్నలిస్టుల పోరమ్(MJF) ,కర్ణాటక రాష్ట్ర MRPS నాయకులు, మాదిగ లాయర్ ఫెడరేషన్, (MLF) సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మంట్లాడుతూ… ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కొరకు మాదిగ, మాదిగ ఉపకులాలు గత 29 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని బిజెపి పార్టీ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిందేఢ్లు దాటినా బీజేపి ప్రభుత్వం వర్గీకరణ బిల్లుకు చట్ట భద్దత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వరంగల్ పర్యటన సందర్భంగా వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో నే పాటు మాదిగ, మాదిగ ఉప కులాల ప్రధాన డిమాండ్ అయిన SC వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని మంద కృష్ణా మాదిగ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మంద కృష్ణమాదిగ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణ పోరాటం త్యాగాల మధ్య సుదీర్ఘంగా కొనసాగుతుంది అన్నారు. మాదిగల ఉద్యమం పట్ల వ్యక్తిగతంగా తనకు అభిమానం అని చెప్పారు.ఎస్సీ వర్గీకరణ ఎప్పుడో కావాల్సిన అంశం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ అంశం పట్ల కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం