Wine shops Closed: రెండు రోజులు వైన్స్ షాపులు బంద్-liquor shops closed for 2 days in hyderabad over bonalu festival ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Liquor Shops Closed For 2 Days In Hyderabad Over Bonalu Festival

Wine shops Closed: రెండు రోజులు వైన్స్ షాపులు బంద్

HT Telugu Desk HT Telugu
Jul 23, 2022 09:49 PM IST

హైదరాబాద్ పరిధిలో ఆది, సోమవారాల్లో వైన్ షాపులు బంద్ కానున్నాయి. బోనాల పండగ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రెండురోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

మందుబాబులకు బ్యాడ్ ​న్యూస్
మందుబాబులకు బ్యాడ్ ​న్యూస్

Wine shops Closed in Hyderabad: హైద‌రాబాద్ వ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. సోమ‌వారం ఫ‌ల‌హార బండ్ల‌ను ఊరేగించ‌నున్నారు. ఈ నేపథ్యంలో వైన్స్ షాపుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం యథావిథిగా షాపులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బోనాల నేపథ్యంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు…

న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఆది, సోమ‌వారాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.లోయ‌ర్ ట్యాంక్‌బండ్ వ‌ద్ద సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు. ఇక్బాల్ మీనార్ నుంచి క‌ట్ట‌మైస‌మ్మ టెంపుల్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను అనుమ‌తించ‌బోమ‌ని స్పష్టం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి క‌ట్ట‌మైస‌మ్మ ఆల‌యం వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను.. దోమ‌ల్‌గూడ‌లోని స్ట్రీట్ నంబ‌ర్ 5 మీదుగా రిల‌య‌న్స్ అపార్ట్‌మెంట్‌(ర‌మ్య హోట‌ల్‌), లిబ‌ర్టీ వైపు మ‌ళ్లించ‌నున్నారు. తెలుగు త‌ల్లి ఫ్లై ఓవ‌ర్ మీదుగా వెళ్లే వాహ‌నాల‌ను తెలుగు త‌ల్లి జంక్ష‌న్ మీదుగా మ‌ళ్లిస్తారు. ఇక క‌వాడిగూడ నుంచి డీబీఆర్ మిల్స్ మీదుగా వ‌చ్చే వాహ‌నాల‌ను.. ఎమ్మార్వో ఆఫీసు వ‌ద్ద వార్త లేన్, ఇందిరా పార్క్ మీదుగా అశోక్ న‌గ‌ర్ వైపు మ‌ళ్లించ‌నున్నారు.

ఉప్ప‌ల్ నుంచి అంబ‌ర్‌పేట్ వైపు వ‌చ్చే జిల్లా, సిటీ బ‌స్సుల‌తో పాటు ఇత‌ర వాహ‌నాల‌ను ఉప్ప‌ల్ క్రాస్ రోడ్స్, హ‌బ్సిగూడ‌, తార్నాక‌, అడిక్‌మెట్‌, విద్యాన‌గ‌ర్‌, ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌, టీవై మండ‌లి, టూరిస్ట్ హోట‌ల్ జంక్ష‌న్‌, నింబోలి అడ్డా, చాదర్‌ఘాట్‌, సీబీఎస్‌కు మ‌ళ్లించ‌నున్నారు. ఇదే మార్గంలో తిరిగి వాహ‌నాలు వెళ్ల‌నున్నాయి. ఉప్ప‌ల్ నుంచి అంబ‌ర్‌పేట్ వైపు వ‌చ్చే సాధార‌ణ ట్రాఫిక్‌ను.. రాయ‌ల్ జ్యూస్ కార్న‌ర్, మ‌ల్లికార్జున న‌గ‌ర్, డీడీ కాల‌నీ, సిండికేట్ బ్యాంక్, శివం రోడ్ వైపు మ‌ళ్లిస్తారు. ఆంక్షల పాటిస్తూ ప్రయాణికులు సహకరించాలని పోలీసులు ఓ ప్రకటనలో కోరారు.

IPL_Entry_Point

టాపిక్