HYD Accident: అర్థరాత్రి బైక్‌పై విన్యాసాలు, ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై ముగ్గురు మైనర్లు దుర్మరణం-latenight bike stunts end in tragedy on aaramghar flyover three minors dead ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Accident: అర్థరాత్రి బైక్‌పై విన్యాసాలు, ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై ముగ్గురు మైనర్లు దుర్మరణం

HYD Accident: అర్థరాత్రి బైక్‌పై విన్యాసాలు, ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై ముగ్గురు మైనర్లు దుర్మరణం

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 28, 2025 08:15 AM IST

HYD Accident: హైదరాబాద్‌ ఆరాంఘర్‌ కొత్త ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్లు మృతి చెందారు. బైక్‌పై మితిమీరిన వేగంతో స్టంట్లు చేస్తుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో బహదూర్‌పురాకు చెందిన ముగ్గురు మృతి చెందారు.

ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం
ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం

HYD Accident: హైదరాబాద్‌ బహదూర్‌పూర్ -ఆరాంఘర్‌ మధ్య ఇటీవలే అందుబాటులోకి వచ్చిన కొత్త ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహదూర్‌పురాకు చెందిన ముగ్గురు మైనర్లు బైక్‌పై వెళుతూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో మృతి చెందారు.

yearly horoscope entry point

బహదూర్‌పురా నుంచి ఆరాంఘర్ వైపు వెళుతుండగా శివరాంపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఫ్లైఓవర్‌ పిల్లర్ నంబర్ 43 సమీపంలో అతి వేగంగా ప్రయాణిస్తున్న యువకులు రోడ్డు మధ్యలో ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఆ తర్వాత డివైడర్‌ ను తాకుతూ కింద పడిపోయారు. ఈ ఘటనలో ఖాద్రి , అహ్మద్ స్పాట్‌లో చనిపోయారు. సయ్యద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

15ఏళ్లలోపు పిల్లలకు బైక్ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వివరించారు. తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు మరణించడంతో వారి కుటుంబాలను విషాదంలో నింపింది.

Whats_app_banner