Land Dispute: అన్నదమ్ముల మధ్య భూ వివాదం...జగిత్యాలలో కొడుకును కడతేర్చిన తండ్రి-land dispute between brothers father killed his son in jagityala ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Land Dispute: అన్నదమ్ముల మధ్య భూ వివాదం...జగిత్యాలలో కొడుకును కడతేర్చిన తండ్రి

Land Dispute: అన్నదమ్ముల మధ్య భూ వివాదం...జగిత్యాలలో కొడుకును కడతేర్చిన తండ్రి

HT Telugu Desk HT Telugu

Land Dispute: భూ వివాదం ఒకరి ప్రాణం తీసింది. అన్నదమ్ముల మధ్య గొడవ వివాదాస్పదంగా మారి కత్తిపోట్లకు దారితీసింది. పెద్ద కొడుకుపై తండ్రి కత్తితో దాడి చేయగా తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు.

తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయిన తనయుడు

Land Dispute: భూ వివాదం ఒకరి ప్రాణం తీసింది. అన్నదమ్ముల మధ్య గొడవ వివాదాస్పదంగా మారి కత్తిపోట్లకు దారితీసింది. పెద్ద కొడుకుపై తండ్రి కత్తితో దాడి చేయగా తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. కొడుకుల మద్య భూ వివాదంతో తండ్రీ కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావుపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. కోట గంగారాజంకు రాజేశ్, రాకేశ్ ఇద్దరు కుమారులు. గంగారాజం, అతడి కుమారుల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో అందరూ కలిసి గంగరాజం మాట్లాడుకుందామని బందువుల ఇంటి వద్ద సమావేశం అయ్యారు

భూమి విషయంలో పెద్ద కుమారుడు రాజేశ్, చిన్న కుమారుడు రాకేశ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో తండ్రీ గంగరాజం పెద్ద కుమారుడు రాజేశ్ పై కత్తితోదాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన రాజేశ్ ను కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించే క్రమంలో మృతి చెందారు.

పోలీసులకు లొంగిపోయిన తండ్రీ..

భూ వివాదంతో తనయుడి పై కత్తితో దాడి చేసిన తండ్రీ గంగరాజం పోలీసులకు లొంగిపోయాడు. ఆస్తి విషయంలో గొడవ జరుగగా క్షణికావేశంలో తానే దాడి చేశానని గంగరాజం ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.

అంతిమ యాత్రలో ఘర్షణ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతిమ యాత్రలో రెండు వర్గాల మద్య ఘర్షణకు దారితీసింది. తంగళ్ళపల్లి మండలం కస్బెకట్కూర్ లో దళితుడు బత్తుల సుమన్ (32) గుండెపోటుతో మృతిచెందాడు. అంతిమయాత్రలో భాగంగా డప్పుచప్పుళ్లతో తీసుకెళ్తుండగా గ్రామంలోని జూపల్లి అజయ్ రావు ఇంటి ఎదుట అంతిమయాత్ర ఆగింది.

కావాలనే తన ఇంటి ఎదుట శవయాత్ర నిలిపారని అజయ్ రావు ఆగ్రహంతో దూషించాడు. అంత్యక్రియల అనంతరం తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన జూపల్లి వెంకట్రావు, రాజేశ్వరరావు కారణంగానే ఇంటి ఎదుట అంతిమయాత్ర నిలిపారని ఆగ్రహంతో వారిపై దాడికి దిగాడు. అడ్డుకోవడానికి వెళ్లిన డ్రైవర్ కృష్ణ సైతం గాయపడ్డాడు.

ఈ దాడిలో వెంకట్ రావు చిటికెన వేలు ప్యాక్షర్ అయింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దళితసంఘాల నాయకులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)