TRS Munugodu: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. కూసుకుంట్లకే టికెట్-kusukuntla prabhakar reddy announced as a trs candidate for munugodu bypoll ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kusukuntla Prabhakar Reddy Announced As A Trs Candidate For Munugodu Bypoll

TRS Munugodu: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. కూసుకుంట్లకే టికెట్

HT Telugu Desk HT Telugu
Oct 07, 2022 12:07 PM IST

trs candidate for munugodu bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఇంఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ ప్రకటించారు.

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు

kusukuntla prabhakar reddy: మునుగోడు అభ్యర్థిపై టీఆర్ఎస్ అధినాయకత్వం ఎట్టకేలకు నిర్ణయం ప్రకటించింది. పార్టీ తరపున అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఇంఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 2003 నుంచి టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న కూసుకుంట్ల... 2014 ఎన్నికల్లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

ట్రెండింగ్ వార్తలు

munugodu trs candidate 2022: వాస్తవానికి ఉపఎన్నిక తెరపైకి వచ్చిన నాటి నుంచి చాలా మంది పేర్లు వచ్చాయి. అయితే కూసుకుంట్ల వైపే టీఆర్ఎస్ అధినాయకత్వం మొగ్గుచూపినట్లు వార్తలు వచ్చాయి. అధికార పార్టీ అనుకూల పత్రికలోనూ వార్తలు కూడా ప్రచురితం అయ్యాయి. అయితే రెబల్స్ బెడద ఎక్కువగా ఉండటం, సామాజిక సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీల వ్యూహల అంచనా వేసిన టీఆర్ఎస్ అధినాయకత్వం... అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. అయితే గ్రౌండ్ లో మాత్రం వేగంగా పావులు కదుపుతూనే వస్తోంది. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి అన్నీ తానై చూస్తు వస్తున్నారు. ఇక నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన వెంటే ఉంటున్నారు. ప్రతి కార్యక్రమాన్ని మంత్రి డైరెక్షన్ లో చేపడుతూ వస్తున్నారు.

తాజాగా మునుగోడు నియోజకవర్గ నేతలతో ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సమావేశంలోనే అభ్యర్థిగా కూసుకుంట్లనే అనే లీక్ ఇచ్చినట్లు కూడా వార్తలు బయటికి వచ్చాయి. ఇక నియోజకవర్గంలోనూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చుట్టుముట్టేస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా వెళ్తున్నారు. అసమ్మతి నేతలను తన వైపు తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు..! సామూహిక భోజనాలు, ఆత్మీయ సమ్మేళనాలను కూడా నిర్వహిస్తూ... అన్నివర్గాలకు దగ్గరయ్యేలా పావులు కదిపేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరగుతుండటంతో ఆయనే అభ్యర్థి అని చర్చ జోరుగా నడిచిన నేపథ్యంలో... అధినాయకత్వం కూడా ఆఖరిగా ఆయనే పేరునే ఇవాళ అధికారికంగా ప్రకటించింది.

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే మరోసారి టికెట్ రావటంతో... ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో టపాసులు పేల్చారు.

IPL_Entry_Point