KTR Power Point Presentation : ‘బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్’ - మూసీ ప్రాజెక్ట్ పై KTR ప్రజెంటేషన్, 10 ముఖ్య విషయాలు-ktr power point presentation on musi rejuvenation project top 10 key points read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Power Point Presentation : ‘బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్’ - మూసీ ప్రాజెక్ట్ పై Ktr ప్రజెంటేషన్, 10 ముఖ్య విషయాలు

KTR Power Point Presentation : ‘బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్’ - మూసీ ప్రాజెక్ట్ పై KTR ప్రజెంటేషన్, 10 ముఖ్య విషయాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 18, 2024 06:44 PM IST

మూసీ ప్రాజెక్ట్ పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTR పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రేవంత్ సర్కార్ చేప‌ట్టబోయేది మూసీ బ్యూటిఫికేష‌న్ కాదని.. లూటిఫికేష‌న్ అని విమర్శించారు. ఢిల్లీకి మూటలు పంపడం కోసమే మూసీ ప్రాజెక్ట్‌ చేపట్టారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను వివరించారు.

మూసీ ప్రాజెక్ట్ పై KTR ప్రజెంటేషన్
మూసీ ప్రాజెక్ట్ పై KTR ప్రజెంటేషన్

మూసీ బ్యూటిఫికేషన్‌ కాదు.. లూటిఫికేషన్‌ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మూసీ ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజంటేన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఢిల్లీకి మూటలు పంపడం కోసమే మూసీ ప్రాజెక్ట్‌ చేపట్టారని కేటీఆర్ ఆరోపించారు. చేయని సర్వేను చేసినట్టు రేవంత్ అబద్ధాలు చెప్పారని అన్నారు. మూసీ విషయంలో సీఎం రేవంత్‌ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని ఎద్దేవే చాశారు. ‘రేవంత్ రెడ్డి ఏమో లక్ష 50 వేల కోట్లు అంటాడు.. జీహెచ్ఏంసీ వాళ్ళు ఏమో 60 వేల కోట్లు అంటారు. ఎవరిది నిజమో, ఎవరిది అబద్ధమో తెలియటం లేదు. ఒక్కోసారి ఒక్కోటి చెప్తున్నారు"అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కేటీఆర్ ప్రజంటేషన్ - 10 ముఖ్యమైన పాయింట్లు

  • మూసీ సుందరీకణ ప్రాజెక్ట్ పై శుక్రవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.
  • మూసీని మురికి కూపంగా మార్చింది గత పాలకులు కాంగ్రెస్, టీడీపీ పార్టీలే. 2015వ సంవత్సరంలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విడుదల చేసిన కాలుష్య కారక నదుల జాబితాలో మూసీ పేరు ఉంది. బీఆర్ఎస్ పార్టీ జూన్ 2014లో అధికారంలోకి వచ్చింది. అంటే అంతకు ముందు పాలించిన రేవంత్ రెడ్డి ప్రస్తుత పార్టీ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గతంలో ఉన్న పార్టీ టీడీపీ పార్టీలు మూసీని మురికి కూపంగా మార్చాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను.
  • మూసీ పునరుజ్జీవన ప్రక్రియ ఎప్పుడో ప్రారంభమైంది. ఎస్టీపీలు పూర్తయ్యాయి, డిజైన్లు, ప్రణాళికలు అన్ని రెడీగా ఉన్నాయి. మళ్లీ కొత్తగా డీపీఆర్‌ల పేరుతో 140 కోట్లు ఖర్చు చేయటం ఎందుకు..?
  • మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఇష్టం లేకుంటే చెప్పండి ఆ రూ.140 కోట్లు నాకు ఉన్న ఆస్తి అమ్మి కడతా అని నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎన్నికలు అఫిడవిట్ తీస్తే అందులో తన ఆస్తి రూ.30 కోట్లు అని పొందపరిచారు. మరి రూ.140 కోట్లు ఎలా కడతారు…?
  • మేం 5 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేశాం. కానీ ఎక్కడా కూడా పేదవాడి పొట్ట కొట్టలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం… పేద వాళ్ల ఇళ్లను కూల్చే పనిలో పడింది. మూసీ సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు.
  • ప్రభుత్వం చెబుతున్న మెయిన్ హార్ట్ కంపెనీపై ఇంటర్ పోల్ రెడ్ వారెంట్ ఉంది. ఆ ఫ్రాడ్ ఏంటంటే… లాహోర్ నగరంలో రావి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకొని మొదట దానికి 50 వేల కోట్ల అంచనా పెట్టారు. తర్వాత వెంటనే గవర్నమెంట్ మారగానే ప్రాజెక్ట్ కాస్ట్ లక్ష కోట్లు చేశారు. అందుకే ఏరి కోరి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాడు.
  • ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అని ప్రజలకు తెలిసిపోయింది. అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో, ఏం చేయాలో తెలియక, గ్రాఫిక్స్ మాయాజాలంతో రేవంత్ రెడ్డి తంటాలు పడుతున్నాడు.
  • మూసీ సుందరీకరణ విషయంలో రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఒకరోజు సుందరీకరణ, ఇంకోరోజు ప్రక్షాళన, ఇంకోరోజు పునరుజ్జీవం, మరొకరోజు నల్లగొండకు మంచినీళ్లు అంటూ మాటలు మారుస్తున్నారు. నల్గొండ జిల్లా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
  • కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు రిపోర్టు తెప్పించుకున్నాం. మూసీ మురికికూపంగా మారింది. బీవోడీ, సీవోడీ ఈ రెండింటిలో కూడా మూసీ ప్ర‌మాద‌భ‌రిత‌మైన స్థాయిలో ఉంద‌ని రిపోర్టులో చెప్పారు. 2016 దాకా మున్సిప‌ల్ మినిస్ట‌ర్‌గా కేసీఆర్ ఉన్నారు. ఆ త‌ర్వాత నేను మున్సిప‌ల్ మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్నాను. కేసీఆర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో అక్క‌డ ఉండే ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేసి పున‌రుజ్జీవం, సుంద‌రీక‌ర‌ణ చేసే విధంగా సంక‌ల్పించాం.
  • మూసీ పునరుజ్జీవన ప్రక్రియకు బీఆర్ఎస్ హయాంలోనే బీజం పడింది. ఎస్టీపీలు కూడా పూర్తయ్యాయి. అలాంటప్పుడు మళ్లీ రూ. 140 కోట్లు ఖర్చు చేసి డీపీఆర్ చేయించటం ఎందుకు…? కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం గా మారింది. దాని కోసమే మూసీని ముందు పెట్టి రూ. 1,50,000 కోట్ల లూటీకి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు.

Whats_app_banner

సంబంధిత కథనం