KTR : నవంబర్ 29 లేకపోతే.. డిసెంబర్ 9 ప్రకటన లేదు.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-ktr interesting comments about november 29 and december 9 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr : నవంబర్ 29 లేకపోతే.. డిసెంబర్ 9 ప్రకటన లేదు.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

KTR : నవంబర్ 29 లేకపోతే.. డిసెంబర్ 9 ప్రకటన లేదు.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Basani Shiva Kumar HT Telugu
Dec 09, 2024 06:05 PM IST

KTR : తెలంగాణలో నవంబర్ 29, డిసెంబర్ 9వ తేదీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ రెండు తేదీలపై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంది. అటు సోనియా గాంధీ పుట్టినరోజు కూడా. ఈ సమయంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారాయి.

దీక్ష విరమిస్తున్న కేసీఆర్ (పాతచిత్రం)
దీక్ష విరమిస్తున్న కేసీఆర్ (పాతచిత్రం)

నవంబర్ 29, డిసెంబర్ 9.. ఈ రెండు తేదీలు తెలంగాణ ప్రజల జీవితాలను మలుపు తిప్పిన రోజులు. నవంబర్ 29న కేసీఆర్ దీక్షకు దిగితే.. డిసెంబర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు.. అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. అటు డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టినరోజు కూడా. ఈ నేపథ్యంలో.. ఈ రెండు తేదీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

yearly horoscope entry point

'మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు .. స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు.. కేసిఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అని చావునోట్లో తలపెట్టిన సంకల్పానికి.. దేశ రాజకీయ వ్యవస్థ దిగివచ్చిన రోజు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 లేకపోతే.. డిసెంబర్ 9 ప్రకటన లేదు. ఈ కీలక మలుపు లేకపోతే.. జూన్ 2 గెలుపు లేనే లేదు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

'దగాపడ్డ నేల విముక్తి కోసం.. ఉద్యమ సారథే ప్రాణత్యాగానికి సిద్ధమై.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరిపోసిన.. దీక్షా విజయ్ దివస్ సందర్భంగా.. యావత్ తెలంగాణ ప్రజలకు..లక్షలాది గులాబీ సైనికులందరికీ.. హృదయపూర్వక శుభాకాంక్షలు' అని కేటీఆర్ కామెంట్ చేశారు.

'గాంధీ, నెహ్రూ సహా ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు కొట్లాడితే భారత దేశానికి స్వాంత్ర్యం వచ్చింది అనేది ఎంత నిజమో.. కేసిఆర్ నిరాహార దీక్షతో దిగివచ్చిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణ ఏర్పాటు ప్రకటన డిసెంబర్ 9, 2009న చేయడం అంతే నిజం. నవంబర్ 29 దీక్షా దివస్ లేకపోతే.. డిసెంబర్ 9 విజయ్ దివస్ లేదు. ఇవి లేకుండా జూన్ 2 తెలంగాణ జన్మ దివస్ లేదు' అని హరీష్ రావు ట్వీట్ చేశారు.

ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన 2009 నవంబర్‌ 29వ తేదీ. కేసీఆర్‌ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినదించి.. 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉద్యమాన్ని విజయ తీరాలకు మరల్చారు కేసీఆర్. స్వరాష్ట్ర ఉద్యమ చరిత్రగా నిలిచారు. కట్టలు తెగుతున్న ప్రజాగ్రహాన్నీ, ప్రజాసంఘాల పటుత్వాన్నీ రాజకీయ ప్రక్రియగా మరల్చి.. స్వరాష్ట్ర లక్ష్యం నెరవేర్చిన కేసీఆర్ సంకల్ప దీక్ష.. తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

Whats_app_banner