Telugu News  /  Telangana  /  Ktr Comments On Bjp In Munugode Trs Candidate Kusukuntla Prabhakar Reddy Nomination Rally
ర్యాలీలో మాట్లాడుతున్న కేటీఆర్
ర్యాలీలో మాట్లాడుతున్న కేటీఆర్ (twitter)

KTR In Munugode : మునుగోడును దత్తత తీసుకుంటా.. మీ గోడు వింటా

13 October 2022, 16:34 ISTHT Telugu Desk
13 October 2022, 16:34 IST

Kusukuntla Prabhakar Reddy Nomination : కాంట్రాక్టరు అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి మధ్య మునుగోడు ఉపఎన్నిక జరుగుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. డబ్బులు పెట్టి గెలవాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.

మునుగోడు(Munugode)లో టీఆర్‌ఎస్‌(TRS) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. నామినేషన్‌ సందర్భంగా బంగారిగడ్డ నుంచి చండూరుకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మంత్రులు కేటీఆర్‌(KTR), జగదీష్‌రెడ్డి, వామపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై కేటీఆర్ విమర్శలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

'టీఆర్ఎస్ తెరాస అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(Kusukuntla Prabhakr Reddy)ని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా. ఫ్లోరోసిస్‌ నిర్మూలన కోసం రూ.19వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్‌(NITI AYOG) సిఫార్సు చేస్తే రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్‌ రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారు. కేసీఆర్‌కు మునుగోడు కష్టం తెలుసు. రాజగోపాల్‌ రెడ్డి(Rajagopal Reddy) ఏనాడూ నియోజకవర్గం గురించి పట్టించుకోలేదు. కేసీఆర్‌(KCR) పేదోళ్లను పెద్దోళ్లను చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోనే లక్షా 13 వేల మందికి రైతుబంధు(Rythu Bandhu) ఇస్తున్నాం. 10 ఏళ్లకు ముందు మునుగోడు ఇప్పుడు మునుగోడును ఒకసారి ఎలా ఉందో మీరే చూడండి.' అని కేటీఆర్ అన్నారు.

కేంద్రంలో ఉన్న ప్రధాని మోదీ(Modi) ధనవంతులను మరింత ధనవంతులను చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబీమా ఇస్తున్నామన్నారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయిన రూ.5లక్షల బీమా ఇస్తున్నామని స్పష్టం చేశారు. నీటికొరత తీరింది కేసీఆర్‌ తో ఫ్లోరోసిస్‌ పీడ పోయిందని కేటీఆర్ అన్నారు.

4 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా రాజగోపాల్‌రెడ్డి చేశారా? అని కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు. 18వేల కోట్ల కాంట్రాక్టు మోదీ ఇచ్చారని రాజగోపాల్‌రెడ్డే చెప్పారన్నారు. ఆయనది చిన్న కంపెనీ అని రాజగోపాల్‌రెడ్డే అన్నారని,, మరి అలాంటి కంపెనీకి రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్‌ ఇచ్చిన పెద్దలు ఎవరు? అని ప్రశ్నించారు. ఓటుకు వేల రూపాయలు ఇస్తామనే అహంకారంతో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే మునుగోడు(Munugode) నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు. అభివృద్ధిలో సంపూర్ణ బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. మీ గోడు నేను వింటా.' అని కేటీఆర్ అన్నారు.

ఎవరికైనా రూ.15లక్షలు వస్తేనే మోదీకి ఓటే వేయాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 5 శాతం జీఎస్టీ(GST) వేసి చేనేతకు ప్రధాని మోదీ మరణ శాసనం రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఓటు వేస్తే 5 శాతం జీఎస్టీ 12 శాతం అవుతుందని వ్యాఖ్యానించారు. చేనేత మిత్ర పేరుతో కేసీఆర్‌ రాయితీలు ఇస్తున్నారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్‌కు ఓటు వేద్దామా.. పథకాలు ఎత్తేసిన మోదీకి వేద్దామా అని అడిగారు.

కృష్ణా జలా(Krishna Water)ల్లో వాటా తేల్చకుండా మోదీ ఇబ్బంది పెడుతున్నారు. జనధన్‌ ఖాతా తెరవండి రూ.15లక్షలు వేస్తానని చెప్పారు. ఆ డబ్బులు వచ్చినవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా రూ.15లక్షలు వస్తే వారు మోదీకి ఓటు వేయండి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు(Jobs) ఇస్తామని మోసం చేశారు. మిర్చి, పకోడి బండి పెట్టుకోవడం కూడా ఉద్యోగాలేనని మోదీ చెబుతున్నారు. దండుమల్కాపూర్‌లో అతిపెద్ద పారిశ్రామిక సమూహం ఏర్పాటు చేశాం.

- కేటీఆర్