KRMB Meeting : సెప్టెంబరులో కేఆర్ఎంబీ సమావేశం.. చర్చకు కీలకమైన అంశాలు-krmb focus on key issues in september meet ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Krmb Meeting : సెప్టెంబరులో కేఆర్ఎంబీ సమావేశం.. చర్చకు కీలకమైన అంశాలు

KRMB Meeting : సెప్టెంబరులో కేఆర్ఎంబీ సమావేశం.. చర్చకు కీలకమైన అంశాలు

HT Telugu Desk HT Telugu
Aug 23, 2022 04:16 PM IST

కృష్ణా జలాల విడుదల, జల విద్యుదుత్పత్తిపై చర్చించేందుకు ఆగస్టు 23న జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా పడింది. సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నట్టుగా బోర్డు ప్రకటన విడుదల చేసింది.

<p>కేఆర్ఎంబీ</p>
కేఆర్ఎంబీ

కేఆర్‌ఎంబీ జలాశయాల పర్యవేక్షణ కమిటీల సమావేశం వాయిదా పడింది. తదుపరి సమావేశం సెప్టెంబరు రెండో తేదీన నిర్వహిస్తున్నట్లు కృష్ణా యాజమాన్య బోర్డు ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా నదీ జలాల భాగస్వామ్యం, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) పవర్‌హౌస్‌ల నిర్వహణకు పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించడం, రిజర్వాయర్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడడం వంటి కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) వచ్చే నెలలో సమావేశం నిర్వహించనున్నట్టుగా తెలిపింది.

yearly horoscope entry point

శ్రీశైలం, ఎన్‌ఎస్‌పీ రిజర్వాయర్‌ల రూల్ కర్వ్‌ల రూపకల్పనకు సంబంధించి మరో కీలకమైన అంశం కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ నీటిపారుదల మరియు కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ (I&CAD) అధికారులు KRMB తదుపరి RMC సమావేశంపై ఆరా తీశారు. భేటీ సమయంలో శ్రీశైలం మరియు NSP రిజర్వాయర్‌ల నియమావళి వక్రరేఖలను రూపొందించడానికి డేటాను అందించాలని అభ్యర్థించారు.

తెలంగాణ, ఏపీ పరిధిలోని కృష్ణా బేసిన్‌లో మిగులు జలాలపై కూడా చర్చ జరగనుంది. దీనికోసం ఓ పద్ధతిని రూపొందించే అంశంపై మాట్లాడనున్నారు. ఆగస్టు 4న జరిగిన RMC సమావేశంలో ఇదే అంశం చర్చకు వచ్చింది. I&CADకి చెందిన సీనియర్ అధికారులు సమావేశంలో వివరణాత్మక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలపై సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జలవిద్యుత్ ఉత్పత్తి, ప్రాజెక్టుల రూల్ కర్వ్స్​​ తో పాటు వరద నీటి వినియోగం, సంబంధిత అంశాలపై కేఆర్‌ఎంబీ జలాశయాల పర్యవేక్షక కమిటీ సైతం సమావేశం కావల్సి ఉంది. మూడు అంశాలకు సంబంధించిన సిఫారసులతో రూపొందించిన నివేదికపై ఆర్‌ఎంసీ సమావేశంలో చర్చించాలి. నివేదికను పరిశీలించి సంతకాలు కూడా చేసేందుకు ఆర్ఎంసీని సమావేశం జరగాలి. కానీ సమావేశం వాయిదా కారణంగా సెప్టెంబర్ రెండో తేదీన తదుపరి సమావేశాలు నిర్వహించనున్నట్లు కృష్ణా బోర్డు తెలిపింది.

Whats_app_banner