Telugu News  /  Telangana  /  Koosukuntla Prabhakar Reddy Sworn In As Mla Presence Of Assembly Speaker
ఎమ్మల్యేగా కూసుకుంట్ల ప్రమాణం
ఎమ్మల్యేగా కూసుకుంట్ల ప్రమాణం (twitter)

Munugodu MLA: ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రమాణం.. 104కు చేరిన TRS బలం

10 November 2022, 12:53 ISTHT Telugu Desk
10 November 2022, 12:53 IST

koosukuntla prabhakar reddy: మునుగోడు ఉపఎన్నికలో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో ఎమ్మెల్యేగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు.

koosukuntla prabhakar reddy sworn in as mla: ప్రతిష్టాత్మకమైన మునుగోడు ఉపఎన్నిక సమరంలో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం అసెంబ్లీలో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిప్రమాణం చేయించారు. ఉదయం అసెంబ్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావ్, జగదీష్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తాజా ఎమ్మెల్యే సీటుతో కలిపి టీఆర్ఎస్ బలం 104కు చేరింది. ప్రస్తుతం అసెంబ్లీలో చూస్తే... మజ్లిస్ కు ఏడుగురు, కాంగ్రెస్ కు ఐదుగురు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

kusukuntla prabhakar reddy: 2003 నుంచి టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న కూసుకుంట్ల... 2014 ఎన్నికల్లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయటంతో... టీఆర్ఎస్ పార్టీ మరోసారి కూసుకుంట్లకే అవకాశం ఇచ్చింది. ఈ ఎన్నికలో పదివేలకుపైగా మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. దీంతో ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు అయింది.

Munugodu byeelction Result: మునుగోడులో మొత్తం 2,25,192 ఓట్లు పోలైతే.. టీఆర్ఎస్‌కు 42.95 శాతం ఓట్లు, బీజేపీకి 38.38 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 10.58 శాతం ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి 10వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మునుగోడు గెలుపుతో.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీ వరుసగా మూడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టింది. మునుగోడు స్థానం దక్కించుకోవటం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది.