Komatireddy : టీఆర్ఎస్‌లోకి వెళ్లినప్పుడు ఏం చేశారన్న కోమటిరెడ్డి…-komatireddy rajagopal fire on tpcc chief revanth reddy ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Komatireddy Rajagopal Fire On Tpcc Chief Revanth Reddy

Komatireddy : టీఆర్ఎస్‌లోకి వెళ్లినప్పుడు ఏం చేశారన్న కోమటిరెడ్డి…

HT Telugu Desk HT Telugu
Aug 06, 2022 02:11 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి 12 మంది ఎమ్మెల్యేలు చేరినపుడు ఎందుకు మాట్లాడలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు బహిరంగ సభలో కోమటిరెడ్డి సోదరులపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంపై రాజగోపాల్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడతున్న కోమటిరెడ్డి
ఢిల్లీలో మీడియాతో మాట్లాడతున్న కోమటిరెడ్డి

తల్లిలాంటి కాంగ్రెస్‌ పార్టీని వీడి 12 మంది తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినపుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదని, వారిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా సీఎల్పీ నాయకుడికి పూర్తిగా సహకరించానని, నియోజక వర్గ సమస్యలపై పూర్తిగా పోరాడానన్నారు. తాను పదవికి రాజీనామా చేస్తే అయినా తనను నమ్ముకున్న ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రాజీనామా చేసినట్లు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

పార్టీలు మారే స్వేచ్ఛ అందరికి ఉందని, పార్టీ మారి కూడా ఎమ్మెల్యే పదవిలో రేవంత్ రెడ్డి ఎలా కొనసాగారని ప్రశ్నించారు. ఒక పార్టీ గుర్తుపై ఎన్నికల్లో గెలిచి మరో పార్టీలో కొనసాగాలనుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. తన రాజీనామా సందర్భంగా వెంకటరెడ్డిని కాంగ్రెస్‌ నేతలు విమర్శించడాన్ని తప్పు పట్టారు. కాంగ్రెస్‌ పార్టీలో 35ఏళ్లు పనిచేసిన వ్యక్తిని, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన వెంకటరెడ్డిని ఉద్దేశించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.

మునుగోడులో తన మీద ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించారని మూడున్నరేళ్లలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని, ఉప ఎన్నిక వస్తుండటంతో రోడ్లు వేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా కలవరని, ఎమ్మెల్యేలు చేయాల్సిన పనులు కూడా జిల్లా మంత్రితో చేయిస్తారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ను కోరినా మునుగోడుకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. నియోజకవర్గంలో పోటీ చేయనని, మునుగోడును బాగు చేయాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. సొంత డబ్బుతో నియోజక వర్గంలో పనులు చేశానని చెప్పారు. మునుగోడ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదని, అలాంటి వ్యక్తిని తమపై బలవంతంగా రుద్దారని, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వని రేవంత్‌ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రిని ఎందుకు చేయాలని ప్రశ్నించారు. పిసీసీ అధ్యక్షుడి హోదాలో తనపై చేసిన విమర్శలు బాధించాయన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపింరు. రేవంత్‌ సీఎం సీఎం కార్యకర్తలతో అనిపించుకుంటున్నాడని సీఎం అంటే చంద్రబాబు ముద్దుబిడ్డ అని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళారని ఆరోపిం పార్టీలో ఎన్ని అవమానాలు జరిగినా ఇన్నాళ్లు భరించామని చెప్పారు. తన రాజీనామా అమోదించకపోతే స్పీకర్ ఇంటి ముందు ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. సిఎం కేసీఆర్‌, కాంగ్రెస్ నాయకుల చేతిలో పరాభవాలకు గురైన వారంతా బీజేపీలోకి వస్తారని చెప్పారు. ముందస్తు ఎన్నికలు వస్తే తెలంగాణలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ తుడిచిపెట్టుకుపోతాయన్నారు.

టాపిక్

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.