Kodakanchi Brahmotsavam: ఫిబ్రవరి 1 నుంచి కొడకంచి ఆలయ బ్రహ్మోత్సవాలు, 4న కళ్యాణం
Kodakanchi Brahmotsavam: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునున్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో ప్రసిద్ధ క్షేత్రంగా పేరుపొందిన కొడకంచి ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్స వాలకు ముస్తాబయ్యాడు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోవంగా జరగనున్నాయి
Kodakanchi Brahmotsavam: తెలంగాణ కంచిగా ప్రసిద్ధి చెందిన కొడకంచి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆదినారాయణుడు కొలువుదీరారు. కోరిన కోరికలు తీర్చే దేవునిగా విరాజిల్లుతున్నాడు. రాష్ట్ర రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో, పఠాన్ చెరువు, సంగారెడ్డి పట్టణాలకు అతి సమీపంలో జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో ఉన్న ఆదినారాయణ స్వామిని బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శించుకునేం దుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తారు ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

ఆదినారాయణ స్వామి ఆలయానికి సుమారు వెయ్యి సంవ త్సరాల పైగా చరిత్ర ఉంది. ఆలయ పునర్ని ర్మాణం తర్వాత దినదినాభివృద్ధి చెందుతున్న, ఈ ఆలయనికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రకృతి వాతావరణంలో స్వయంభు గా వెలిసిన ఆదినారాయణ స్వామి ఆలయం లో బంగారు, వెండి బల్లులు ప్రత్యేకం. వీటిని తాకితే సర్వ దోషాలు తొలగిపోతాయనేది భక్తుల గట్టి నమ్మకం . ఆలయం ఎడమ పక్కన కోనేరులో, భక్తులు స్నానం చేసి తమ మొక్కులు తీర్చుకుంటారు.
ఫిబ్రవరి 4న స్వామివారి కళ్యాణం ...
ఫిబ్రవరి 1, 2 తేదీలలో అధ్యయనోత్స వాలు, సాయంత్రం తొలకి సేవ పూజా కార్య క్రమాలు, 3వ తేదీ సోమవారం సాయంత్రం పుట్ట బంగారు సేవ, అగ్ని ప్రతిష్ట, 4వ తేదీ మంగళవారం రోజు శ్రీవారి ధ్వజ రోహణం, సాయంత్రం భేరి పూజ, రాత్రికి ఆదినారా యణ స్వామి కళ్యాణోత్సవం, అశ్వ వాహన సేవ, 5వ తేదీ బుధవారం మధ్యాహ్నం హోమము, బలిహరణం రాత్రి హనుమంత సేవ, 6వ తేదీ గురువారం హోమము, గరుడ ప్రతిష్ట, గోష్టి రాత్రికి గరుడ వాహన సేవ, 7వ తేదీ శుక్రవారం హోమం బలిహ రణం, అమ్మవారి విమాన సేవ, స్వామివారి అలక సేవ, 8వ తేదీ శనివారం స్వామి వారి దివ్య రథోత్సవం ఊరేగింపు, జాతర, 9వ తేదీ ఆదివారం ఉదయం తోపు సేవ హో మంధ్వజ పట ఉద్వాసన, శ్రీ పుష్ప యాగం, స్వామి వారి ఏకాంత సేవ, 10వ తేదీ సోమవారం 16 పండగతో బ్రహ్మోత్సవాల ముగింపు ఉంటుంది.
బ్రహ్మోత్సవాలకు సకల సౌకర్యాలు.…
ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవా లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ అల్లాని రామాజీరావు తెలిపారు. ఆలయా నికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యం, వైద్య సదుపాయం ఏర్పాటు చేస్తున్నామని అయన తెలిపారు.
వాలంటీర్లు భక్తులకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తారన్నారు. జాతర రోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్ పటాన్ చెరు నుంచి కొడకంచి వరకు ప్రత్యేకంగా బస్సులు నడుపుతారని తెలిపారు. జాతరకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై, ఉత్సవాలను విజయవంతం చేయాలనీ అయన ప్రజలకు పిలుపునిచ్చారు.