తెలుగు న్యూస్ / తెలంగాణ /
TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల సర్వే నుంచి అర్హుల ఎంపిక వరకు....! ఈ 10 విషయాలు తెలుసుకోండి
TG Indiramma Housing Survey Updates: ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. సంక్రాంతిలోపు సర్వే పూర్తవుతుంది. ఆ తర్వాతే అర్హుల జాబితాను ప్రకటించనున్నారు. ఇందులో ఇందిరమ్మ కమిటీలతో పాటు గ్రామసభల పాత్ర కీలకంగా ఉండే అవకాశం ఉంది. 10 ముఖ్యమైన అంశాలను ఇక్కడ చూడండి...
ఇందిరమ్మ ఇళ్ల సర్వే అప్డేట్స్
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఎదరు చూస్తున్నారు. ఈ స్కీమ్ కోసం లక్షలాది మంది దరఖాస్తులు చేసుకోగా... ప్రస్తుతం ప్రభుత్వం యాప్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుపుతోంది. సంక్రాంతిలోపే పూర్తి స్థాయిలో సర్వే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలోని సర్వేయర్లు దరఖాస్తుదారుడి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
ఈ సర్వేతో పాటు లబ్ధిదారుల ఎంపిక వరకు ఎలా జరగబోతుందనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. లక్షలాది దరఖాస్తులు రావటంతో అసలైన అర్హుల ఎంపిక ఎలా అనేది అధికారులకు సవాల్ గా మారింది. ఈ క్రమంలోనే సాంకేతికతో కూడా యాప్ సర్వేను చేస్తున్నారు. ఈ సర్వే తర్వాత... అర్హుల ఎంపిక వరకు ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి...
ఇళ్ల సర్వే, అర్హుల ఎంపిక - 10 ముఖ్యమైన పాయింట్స్:
- ప్రస్తుతం జరుగుతున్న సర్వే జనవరి మొదటి వారం లేదా సంక్రాంతి లోపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే సర్వే పూర్తి తర్వాత… లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తారు.
- ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా.. తెలంగాణ ప్రభుత్వం జీవో 33ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సర్వే తర్వాత అర్హుల జాబితాను ప్రకటించే విషయంలో ఈ కమిటీలు కీలకంగా పని చేసే అవకాశం ఉంది.
- ఈ కమిటీలను చూస్తే... గ్రామస్థాయిలో సర్పంచి/ప్రత్యేక అధికారి, వార్డు స్థాయిలో కౌన్సిలర్/కార్పొరేటర్ ఛైర్మనుగా ఉన్నారు. అంతేకాకుండా స్వయం సహాయక గ్రూపుల నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు స్థానికులు సభ్యులును కూడా ఇందులో ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి.
- ఇక పట్టణాల్లోని వార్డుల్లో కూడా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు ప్రధానంగా... అసలైన అర్హులను ఎంపిక చేసే విషయంలో అధికారులకు సహాయసాకారాలను అందిస్తాయి.
- సర్వేలో పథకానికి ఎంపికయ్యే అర్హతలు ఉన్న దరఖాస్తుదారుడిని గుర్తిస్తారు. గ్రామాల వారీగా పేర్లు ఖరారవుతాయి. వీరి వివరాలను ఇందిరమ్మ కమిటీలు పరిశీలించే అవకాశం ఉంది. ఇంతటితోనే కాకుండా... ఖరారయ్యే జాబితాను గ్రామసభలో ప్రవేశపెడుతారు.
- గ్రామ సభలో ప్రవేశపెట్టిన చర్చలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించే అవకాశం ఉంటుంది. స్కీమ్ కు అసలైన అర్హులని భావిస్తేనే గ్రామసభ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాతనే ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితా ఖరారవుతుంది.
- గ్రామసభ, వార్డు స్థాయిలో ఖరారయ్యే జాబితాలను జిల్లా కలెక్టర్లకు పంపుతారు. ఈ పేర్లకు జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ పేర్లను లబ్ధిదారుల జాబితాలో పేర్చి.. ఆన్ లైన్ లో డిస్ ప్లే చేస్తారు.
- ఇక మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది.. తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను కేటాయిస్తారు.
- మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను నాలుగు ధపాలుగా జమ చేస్తారు.
- ఇందిరమ్మ ఇంటి ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక వెబ్ సైట్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
సంబంధిత కథనం