TS Inter Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు - సింగిల్ క్లిక్‌తో ఇలా చూడొచ్చు-know how to check telangana inter 1st and 2nd years results 2024 on httpstsbiecgggovin ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు - సింగిల్ క్లిక్‌తో ఇలా చూడొచ్చు

TS Inter Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు - సింగిల్ క్లిక్‌తో ఇలా చూడొచ్చు

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Apr 23, 2024 11:52 AM IST

TS Inter 1st and 2nd Years Results 2024 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు (TS Inter Results) ఏప్రిల్ 24వ తేదీన అందుబాటులో ఉంటాయి. ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను HT తెలుగు వెబ్ సైట్ తో పాటు ఇంటర్మీడియట్ బోర్డు సైట్ లోనూ చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు - 2024
తెలంగాణ ఇంటర్ ఫలితాలు - 2024

TS Intermediate 1st and 2nd Years Results 2024 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు(TS Inter Results 2024) వచ్చేస్తున్నాయి..! ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 11 గంటలకు ఫలితాలు అందుబాటులోకి వస్తాయి. ఈసారి ఈ పరీక్షలకు 9,22,520 మంది విద్యార్థులు ఫీజును చెల్లించారు. ఇందులో 4,78,527 మంది ఇంటర్ ప్రథమ సంవత్సరం వారు ఉండగా... 4 లక్షలకుపైగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలతో పాటు ఒకేషనల్ కోర్సుల రిజల్ట్స్ కూడా వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో సింగిల్ క్లిక్ తోనే చెక్ చేసుకోవచ్చు. ఇక ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లోనూ ఈ రిజల్ట్స్ చూడొచ్చు.

TS Inter 1st Year Results 2024 Direct Link : కింద కనిపించే కాలమ్ లో విద్యార్థి రూల్ నెంబర్ నెంబర్ ను ఎంట్రీ చేసి 'Check Result' పై క్లిక్ చేస్తే క్షణాల్లోనే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

TS Inter 2nd Year Results 2024 Direct Link : కింద కనిపించే కాలమ్ లో విద్యార్థి రూల్ నెంబర్ నెంబర్ ను ఎంట్రీ చేసి 'Check Result' పై క్లిక్ చేస్తే క్షణాల్లోనే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

How To Check TS Inter Results : HT తెలుగులో తెలంగాణ ఇంటర్ ఫలితాలు

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ ఇంటర్ పరీక్షల(TS Inter Exams 2024) ఫలితాలు హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 11 గంటలకు సింగిల్ క్లిక్ తోనే ఈ ఫలితాలను చూడొచ్చు. క్షణాల వ్యవధిలోనే మీ మార్కులు డిస్ ప్లే అవుతాయి.

How To Check Telangana Inter Results 2024: ఇంటర్ వెబ్ సైట్ లో ఫలితాలు

  • తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/home.do లోకి వెళ్లాలి.
  • IPE ఫస్ట్ ఇయర్ లేదా సెకండియర్ రిజల్ట్స్ లింక్‌ (జనరల్ లేదా ఒకేషనల్) తెరవాలి.
  • మీ హాల్ టికెట్ నంబర్‌ ను ఎంట్రీ సబ్మిట్ బటన్ పై నొక్కాలి.
  • మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ ద్వారా కాపీని పొందవచ్చు.

TS Inter Voc First year Results 2024 Direct Link : కింద కనిపించే కాలమ్ లో విద్యార్థి రూల్ నెంబర్ నెంబర్ ను ఎంట్రీ చేసి 'Check Result' పై క్లిక్ చేస్తే క్షణాల్లోనే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

TS Inter Voc Second Year2024 Direct Link : కింద కనిపించే కాలమ్ లో విద్యార్థి రూల్ నెంబర్ నెంబర్ ను ఎంట్రీ చేసి 'Check Result' పై క్లిక్ చేస్తే క్షణాల్లోనే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

 

గతేడాదితో పోల్చితే ఈసారి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు(Telangana Inter Exams 2024) ముందుగానే ప్రారంభమయ్యాయి. స్పాట్(Telangana Inter Spot Valuation 2024) వాల్యూయేషన్ కూడా త్వరగా పూర్తి అయింది. ఈ ప్రక్రియను మార్చి 10వ తేదీన ప్రారంభించంగా…. మొత్తం నాలుగు విడతల్లో స్పాట్ ను కంప్లీట్ చేశారు. ఏప్రిల్ మొదటి వారంలోపు మూల్యాంకన ప్రక్రియ అంతా కూడా పూర్తి అయింది. ఆ తర్వాత మార్కుల క్రోడీకరణ, సాంకేతికపరమైన అంశాలను పరిశీలించారు. ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాత ఫలితాల విడుదలకు ఏప్రిల్ 24వ తేదీని ఖరారు చేశారు.

2023 తెలంగాణ ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో(TS Inter Results 2023) బాలికలదే హవా. అప్పుడు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలకు మొత్తం 4 లక్షల 33 వేల 82 మంది హాజరు కాగా వీరిలో 2,72,208 మంది పాస్ అయ్యారు. మొదటి సంవత్సరంలో మొత్తం 63.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,60,000 మంది ఏ గ్రేడ్‌లో పాస్‌ కాగా, 68,335 మంది బి గ్రేడ్‌లో పాస్ అయ్యారు. బాలికలు 68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 56.82 శాతం మంది పాస్‌ అయ్యారు. ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లాకు మొదటి స్థానం, రెండో స్థానం రంగారెడ్డి జిల్లాకు దక్కిందిసెకండియర్‌ ఫలితాలలో ములుగు జిల్లాకు మొదటి స్థానం, ద్వితీయ స్థానం కొమురం భీమ్ జిల్లాకు, మూడో స్థానంలో మేడ్చల్ జిల్లాలు నిలిచాయి.

Whats_app_banner

సంబంధిత కథనం